'సర్కార్పై ప్రజావ్యతిరేకత విపరీతంగా పెరిగింది'
హైదరాబాద్: ఏడాది పాలనలోనే టీడీపీ సర్కార్‌పై ప్రజావ్యతిరేకత విపరీతంగా పెరిగిందని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తమకు దగా చేసిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని వర్గాల ప్రజలు సమరదీక్షకు తరలి వస్తున్నారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు.
తొమిదేళ్ల పాలనతో చంద్రబాబు ప్రజలను ఎలా వంచించారో.. ఇప్పుడూ అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వంచనను అర్థం చేసుకున్న ప్రజలు.. వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపి సమరదీక్ష ద్వారా ప్రభుత్వ మొండి వైఖరిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రైతులు.. టీడీపీ సర్కార్‌ది దగాకోరు తనమని మండిపడుతున్నారు . రైతులను బెదిరించి, భయపెట్టి భూములు లాక్కొని.. ఇష్టపూర్వకంగా ఇచ్చారని చెప్పుకోవడం చంద్రబాబు సర్కార్‌కే చెల్లిందంటున్నారు. ఈ దగాకోరు సర్కార్ మెడలు వంచడం కోసమే.. సమరదీక్షలో పాల్గొనేందుకు వేలాదిగా తరలి వచ్చామని రైతులు చెబుతున్నారు.