‘ఇది ప్రజలకు దక్కిన గౌరవం’ | Umma Reddy Venkateswarlu Praises Jagan Mohan Reddy for 3rd Place In Best CMs | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సీఎంలు ఉన్నా ముందు వరసలో నిలిచాడు

Published Sat, Aug 8 2020 3:02 PM | Last Updated on Sat, Aug 8 2020 3:02 PM

Umma Reddy Venkateswarlu Praises Jagan Mohan Reddy for 3rd Place In Best CMs  - Sakshi

సాక్షి, విజయవాడ: దేశంలోనే ప్రతిభ గల ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడో స్ధానంలో నిలవడం గర్వకారణమని మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలో శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘  వైఎస్ జగన్ దేశంలోనే ప్రతిభగల ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో ఉండటం రాష్ట్రానికే గర్వకారణం. ప్రతి చిన్న విషయాన్ని అడ్డుకోవాలని చూసేవారికి, విమర్శించేవారికి ఇది కనువిప్పు కావాలి. మొదటి సారి సీఎం అయినా,  పెద్ద పెద్ద నేతలకంటే మెరుగైన పరిపాలన అందించారు. ఎంతో మంది అనుభవం ఉన్న సీనియర్ సీఎంలు ఉన్నా జగన్ ముందు వరుసలో ఉన్నారు. 15 నెలల్లోనే ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత చూపించారు. అందుకే ఇది ప్రజలకు దక్కిన గౌరవం అని చెప్పాలి’ అని కొనియాడారు. 

చదవండి: 'చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement