
సాక్షి, అమరావతి/బాపట్ల: శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి నియమితులు కావడం వరుసగా ఇది రెండో సారి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి ఇటీవల గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. దాంతో ఉమ్మారెడ్డిని మరోసారి మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా సీఎం వైఎస్ జగన్ నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment