ఆంధప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా దీక్ష మద్దతుదారులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున సంఘీభావం తెలిపేందుకు కదిలారు.
కడప: ఆంధప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు కడప జిల్లా వ్యాప్తంగా దీక్ష మద్దతుదారులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున సంఘీభావం తెలిపేందుకు కదిలారు.
పోరుమామిళ్ల నుంచి ఎమ్మెల్యే జయరాములు, నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజలు బయలుదేరగా రాజం పేట నుంచి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా దీక్ష వద్దకు తరిలారు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కూడా భారీగా రైతులు, విద్యార్థులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు.