ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ముందునుంచి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుందని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంజన్ భాషా అన్నారు.
కడప: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ముందునుంచి కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుందని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంజన్ భాషా అన్నారు. కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి భారీగా ప్రజలు తరిలారు.
ఈ నేపథ్యంలో ఆయన అంజన్ భాషా మాట్లాడుతూ ఒక్క జిల్లా నుంచే దాదాపు నాలుగు లక్షలమంది వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్నారని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచైనా వైఎస్ జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. చంద్రబాబు నైజం అందరికీ తెలిసిందేనని, తొలి దీక్షా స్థలిని అందుకే అడ్డుకున్నారని, అప్పుడే ఆయన కుట్ర తెలిసిందని చెప్పారు. సొంత ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడం లేదని చెప్పారు.