
ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపు
రాజంపేట (వైఎస్సార్ కడప): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 24న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తన స్వగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ ఆడుతున్న డ్రామా పార్లమెంటు సాక్షిగా బహిర్గతమైందన్నారు. పార్లమెంటు పరిధిలోని చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోని వ్యాపార, వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు, కార్మికులు, ఉద్యోగులు, రాజకీయపార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలనిరసన ఢిల్లీకి చేరేలా నినందించాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు.
బయటపడ్డ‘దేశం’డ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడుతున్న డ్రామాలు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మాటల్లో తేటతెల్లమయ్యాయని అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు చేసిన ప్రసంగాలలోని వాదనలన్నీ నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ వినిపించినవేననే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.