
మాట్లాడుతున్న ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు
రాజంపేట రూరల్ (వైఎస్సార్ కడప) : బీజేపీ,టీడీపీల మధ్య రహస్య ఎజెండా నడుస్తోందనే దానికి నేటి పార్లమెంటు సమావేశాలే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో శుక్రవారం రైల్వేకోడూరు ఎమ్మేల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతంలో 13సార్లు వైఎస్సార్‌సీపీ నోటీసులివ్వగా అనుమతించని స్పీకర్ టీడీపీ ఇచ్చిన తీర్మానానికి తొలి రోజే అనుమతివ్వడం వారి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమన్నారు.నేడు ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు సమావేశాల్లో చర్చించారంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనతేనన్నారు.వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు ఇచ్చినపుడు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేదన్నారు.
జననేత వైఎస్ జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల.శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ మోసం చేసిందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందంటే అది వైఎస్సార్ æముఖ్యమంత్రిగా ఉన్నపుడేనన్నారు. ఆర్భాటానికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు శూన్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment