సీమాంధ్ర ప్రజల మీద చంద్రబాబునాయుడుకు అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
గుంటూరు : సీమాంధ్ర ప్రజల మీద చంద్రబాబునాయుడుకు అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సమన్యాయం చేయాలంటూ గుంటూరులో వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్ష ప్రాంగణంలో ఆయన మంగళవారం మాట్లాడారు.
తెలంగాణ ప్రకటన వచ్చేవరకూ కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కళ్లు మూసుకుని కూర్చున్నారంటే సీమాంధ్రపై వారి చిత్తశుద్ధి ఎలాంటిదో తెలియచేస్తుందన్నారు. ఆహార భద్రత బిల్లును సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించినప్పుడే వారిని ప్రజలు నమ్ముతారని బాలినేని అన్నారు.