‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్‌పై వచ్చి పరామర్శించాడా?’ | Balineni Srinivasa Reddy Comments On Tdp And Janasena | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్‌పై వచ్చి పరామర్శించాడా?’

Published Sun, Dec 10 2023 3:31 PM | Last Updated on Thu, Dec 14 2023 11:32 AM

Balineni Srinivasa Reddy Comments On Tdp And Janasena - Sakshi

సాక్షి, ప్రకాశం: గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెటిలర్స్‌ ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది.. అదే కాంగ్రెస్‌ గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు ఇప్పటికీ కూడా సంబరాలు చేసుకునేవాళ్లని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయిందన్నారు.

‘‘తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్‌కి సపోర్ట్‌.. పవన్‌ కల్యాణ్‌ బీజేపీకి మద్దతు. ఆంధ్రాలో పవన్‌, చంద్రబాబు కలిసి పోటీనా? వీళ్లకు నైతికత లేదు. వీళ్ల అనైతిక పొత్తులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. బాపట్లకి సీఎం వస్తే అసత్య ప్రచారాలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్‌పై వచ్చి పరామర్శించాడా? తుపానుకు సంబంధించి సీఎం జగన్‌ ముందుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు కాబట్టే ప్రజలు సంతోషంగా ఉన్నారు’’ అని బాలినేని పేర్కొన్నారు.

గతంలో వర్షం వస్తే ఒంగోలు జలమయమయ్యేది.. కానీ ఇప్పుడు చుక్కనీరు కూడా నిలబడకుండా అభివృద్ధి చేసి చూపించాం. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై  గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇప్పుడు ఈ శిక్ష. 2024లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా.. మరలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని నిక్కచ్చిగా చెప్తున్నానని బాలినేని అన్నారు.
ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement