ఏడాది పాలనలో ఎన్నికల వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైన టీడీపీ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి
నరసన్నపేట : ఏడాది పాలనలో ఎన్నికల వాగ్దానాల అమలులో పూర్తిగా విఫలమైన టీడీపీ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్రపార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు పిలుపునిచ్చారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏ పరిస్థితుల్లో జగన్ సమర దీక్ష చేస్తున్నదీ వివరించారు. ఏపీ రాజధాని మంగళగిరిలో 3,4 తేదీల్లో చేపట్టనున్న దీక్షలో పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల వారు తరలిరావాలని కోరారు. టీడీపీ రైతులకు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నిస్సిగ్గుగా తుంగలో తొక్కిందన్నారు.
ప్రభుత్వ తీరును నిరసించకపోతే మరింతగా ప్రజలకు అన్యాయం చేయడానికి టీడీపీ బరితెగించే ప్రమాదం ఉందన్నారు. అందుకే జగన్మోహనరెడ్డి సమరదీక్ష పూనుకున్నారని, అన్నివర్గాల ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు మద్దతు నివ్వాలని కోరారు. నరసన్నపేట నుంచి సమరదీక్షకు ప్రత్యేకంగా పయనమవుతున్నామని కృష్ణదాసు తెలిపారు. సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరంగి మురళి, కరిమి రాజేశ్వరరావు, యాళ్ల బైరాగినాయుడ గ్గు రమణయ్య, మడ్డు కృష్ణ తదితరులు ఉన్నారు.