బెజవాడ కనకదుర్గను దర్శించుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు.
అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షకు ప్రభుత్వం పలు రకాలుగా ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను చేస్తున్న దీక్ష విజయవంతం కావాలని, ప్రజలకు మేలు జరగాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకొని అనంతరం గుంటూరుకు బయలు దేరారు.