జంగారెడ్డిగూడెం / జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే సోనియూగాంధీ రాష్ట్ర విభజనకు పూనుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని విమర్శించారు. వైఎస్ విజయమ్మ సమరదీక్షకు మద్దతుగా స్థానిక గంగానమ్మ గుడి సెంటర్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రాఘవరాజు ఆది విష్ణును ఆళ్ల నాని, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ పరామర్శించి మద్దతు తెలిపారు. నాని మాట్లాడుతూ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాలకు ఆదివిష్ణు ఆమరణ దీక్ష మరింత ఉత్సాహాన్నిస్తోందన్నారు. కావూరి లాంటి అనామకులకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారని, సీమాంధ్ర నాయకులను ప్రలోభపెట్టి పదవులను ఎరచూపిన ఢిల్లీ పెద్దలు ప్రజలను మాత్రం మభ్యపెట్టలేరని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతం వారు భూములు, ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్‌ను వదులుకోవాలని తెలంగాణ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని చెప్పారు.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అండ చూసుకుని రాష్ట్ర విభజనకు పాల్పడుతున్నారన్నారు. విభజన నిర్ణయూన్ని వెనుకకు తీసుకోకపోతే కోట్లాదిమంది సీమాంధ్రులు కాంగ్రెస్, టీడీపీలను తరిమికొడతారని హెచ్చరించారు. మోషేన్‌రాజు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా లెటర్ ఇచ్చానని, దానికే కట్టుబడి ఉన్నానని చంద్రబాబునాయుడు పేర్కొనడం దారుణమన్నారు. మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్న ఉద్యోగుల ఉద్యమంలో భాగస్వాములమవుతామని, వారికి ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మండల, పట్టణ కన్వీనర్లు నులకాని వీరాస్వామి నాయుడు, చనమాల శ్రీనివాస్, నాయకులు గుడిపూడి రవి, పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాల్ దీక్షకు మద్దతు
జంగారెడ్డిగూడెంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన తిరివీధి వేణుగోపాల్ దీక్షా శిబిరం వద్దకు వైఎస్సార్ సీపీ నాయకులు ఆళ్ల నాని, కొయ్యే మోషేన్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, ఇందుకూరి రామకృష్ణంరాజు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ పాశం రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. జేఏసీ ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
రాహుల్ కోసమే విభజన
Published Fri, Aug 23 2013 3:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement