'చంద్రబాబు భజన చేస్తున్న వెంకయ్య'
హైదరాబాద్: ఆరోగ్యం క్షీణిస్తున్నందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష విరమించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నందున ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాకకు ముందే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలన్నారు. ముందుగా వైఎస్ జగన్ దీక్ష విరమించాలని, సానుకూల ప్రకటన రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా10 ఏళ్ల పాటు కావాలని డిమాండ్ చేసిందే వెంకయ్య నాయుడు అని గుర్తు చేశారు. హామీని నెరవేర్చాల్సిన వెంకయ్య ఇప్పుడు చంద్రబాబు భజన చేస్తున్నారని విమర్శించారు.