ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకుంటే మంచిదని చెప్పారు.
ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ప్రధాని అనవసరంగా అపవాదు మోయొద్దని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ప్రధానిపై నమ్మకం ఉందని, దానిని కోల్పోవద్దని హితవు పలికారు. పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు.