
అవినాష్ రెడ్డి దీక్షకు దిగి వచ్చిన ఆర్టీపీపీ
కడప : భూ నిర్వాసితుల కోసం కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి చేపట్టిన దీక్షకు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) యాజమాన్యం దిగివచ్చింది. ఆర్టీపీపీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అవినాష్ రెడ్డితో చర్చలు జరిపారు. భూ నిర్వాసితుల డిమాండ్ మేరకు జనవరి 1 లోపు 96 ఉద్యోగాలు ఇస్తామని డైరెక్టర్ చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రైతులు దీక్ష విరమించారు.
ఆర్టీపీపీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో భూ నిర్వాసితులు రిలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతు పలికారు. యాజమాన్యం దిగి రాకపోవటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీక్షకు దిగారు.