కడప ఎంపీ అవినాష్ రెడ్డి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రస్తుతం నిరంకుశ పాలన సాగుతోందని, ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి జిల్లా కలెక్టర్ కేవీ రమణ, ఇతర అధికారులు బయటకు వెళ్లిపోవడంపై శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన వారికి ఎలాంటి సమాచారం ఉండటం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినా కనీస సమాచారం కూడా అందటం లేదని ఆదేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తీరు అందరినీ బాధిస్తోందన్నారు. ఇటీవల విజిలె న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అన్ని విషయాలు స్పష్టంగా వివరించినా కలెక్టర్ తీరు మారలేదన్నారు.
ఫోన్లు కూడా ఎత్తరన్నారు. ఏదైనా ఆడిగితే రూల్స్ ప్రకారం పోవాలని చెబుతారని, ఆయన మాత్రం రూల్స్ పాటించరన్నారు. జెడ్పీ సమావేశం నుంచి.. కనీసం జెడ్పీ చైర్మన్‌కైనా చెప్పకుండా అధికారులను వెంట బెట్టుకుని బయటకు వెళ్లిపోవడం తగదన్నారు. ఈ కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ.. సమావేశంలోంచి అర్ధంతరంగా వెళ్లిపోవాలని ముందస్తు వ్యూహంతోనే కలెక్టర్ వచ్చారన్నారు. మరీ ఇంత నిర్లక్ష్యమా..‘‘ఎమ్మెల్యేలంటే ఈ కలెక్టర్‌కు ఏ మాత్రం లెక్కలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ
ఇది నిరంకుశ పాలన
విలువ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోటకు వస్తున్నారంటే మాకు కనీస సమాచారం లేదు. ఇదేమైనా బ్రిటీష్ సామ్రాజ్యమా. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే పట్టించుకోకపోవడం భావ్యం కాదు. జిల్లా అభివృద్ధి కోసమే నిధులు ఖర్చు చేస్తున్నాం. నిధుల ఖర్చు విషయంలో అర్ధరాత్రి చర్చ పెట్టినా లెక్కలు పెట్టేందుకు మేము సిద్ధం. ఏ విషయం స్పష్టంగా మాట్లాకుండా సమావేశం నుంచి కలెక్టర్, అధికారులు వెళ్లిపోవడం తగదు ’’ అని మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి అన్నారు.
ఇది నిరంకుశ పాలన
Published Sun, Jul 5 2015 2:43 AM | Last Updated on Thu, Aug 9 2018 5:07 PM
Advertisement
Advertisement