Rtpp
-
సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘ఎంవీఆర్’ పేరు
సాక్షి, అమరావతి/ఎర్రగుంట్ల( వైఎస్సార్ జిల్లా): రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్) సేవలకు గుర్తింపుగా, రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్సార్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకొస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు థర్మల్ ప్లాంట్లకు ముగ్గురు ప్రముఖుల పేర్లు రాష్ట్రంలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లుండగా, వేర్వేరు రంగాలకు చెందిన వారి పేర్లు వాటికి సార్థక నామధేయాలుగా మారాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్లాంట్‌కు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రమని పేరు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని పవర్ ప్లాంటుకు విద్యుత్ రంగ పితామహుడుగా పేరు పొందిన డాక్టర్ నార్ల తాతారావు పేరు పెట్టారు. తాజాగా ఆర్టీపీపీని కార్మిక నేత ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా ప్రభుత్వం మార్చింది. ఎంవీఆర్ కృషితో సీమలో థర్మల్ ప్లాంట్ వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం థర్మల్ విద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయాలని మొట్టమొదట డిమాండ్ చేసిన నేత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. 1985లో ‘రాయలసీమ కన్నీటి గాథ’ అనే పుస్తకం ద్వారా ఆయన రాయలసీమ సమస్యలను, గణాంకాలు, సహేతుకమైన ఆధారాలతో రాష్ట్ర ప్రజల దృష్టికి తెచ్చారు. కరువుతో అల్లాడుతున్న సీమకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఎంవీఆర్ చేసిన డిమాండ్.. ఆర్టీపీపీ స్థాపనకు బాట వేసిందని, ఆ నేతకు నివాళిగా ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా మార్చాలని రాయలసీమ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ విమోచన సమితి పేరుతో రమణారెడ్డి, రాయలసీమ సంయుక్త కార్యాచరణ సమితి పేరుతో వైఎస్సార్, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకరెడ్డి తదితర నేతలంతా అప్పట్లో ఉద్యమం చేపట్టారని సాహితీవేత్త భూమన్ తెలిపారు. ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా మార్చడం దివంగత నేతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యలు ప్రశంసించారు. ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రికి, ఇంధన శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీపీపీకి ఎంవీఆర్ పేరు చేర్చడాన్ని రాయలసీమ వాసులు స్వాగతిస్తున్నారు. -
ఉవ్వెత్తున వెలుగులు
సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) వెలుగులు నింపుతోంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు లోఓల్డేజీ సమస్యలను కట్టడి చేస్తోంది. విద్యుత్ కోతలకు ఆస్కారం లేకుండా ఆరు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. 1650 మెగావాట్లు సామర్థ్యానికి గాను 1450 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి పైగా ఇంతటి సామర్థ్యంలో విద్యుత్ ఉత్పత్తి తీయలేదని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లభిస్తోంది. ఒక్కో యూనిట్ 210 మెగావాట్లు సామర్థ్యంతో 5 యూనిట్లు ఆర్టీపీపీలో నెలకొల్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకటి, రెండవ యూనిట్లు నోచుకోగా, 3, 4, 5, 6 యూనిట్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదిద్దుకున్నాయి. 6వ యూనిట్ 600 మెగావాట్లు సామర్థ్యంతో నెలకొల్పడంతో మొత్తంగా 1650 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఏర్పడింది. కాగా 2014–19 టీడీపీ సర్కార్ హయాంలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడింది. ఆశించిన మేరకు విద్యుత్ ఉత్పాదన నోచుకోలేదు. ముందుచూపు లేకపోవడంతో టీడీపీ హయాంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నమైందని కార్మికులు వివరిస్తున్నారు. కాగా ఏడాదిగా ఈ స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం ప్రస్తుత ఉత్పత్తే అరుదు అని యంత్రాంగం వివరిస్తోంది. దినదినాభివృద్ధి.... రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దినదినాభివృద్ధి వేగంగా చోటుచేసుకుంది. ఎన్టీ రామారావు హయాంలో అంకురార్పణ చేసి, తొలి యూనిట్‌ను ప్రారంభించి, రెండవ యూనిట్ పనులు కొనసాగించారు. ఆ పనులను చంద్రబాబు సర్కార్ పూర్తి చేయించింది. దివంగత సీఎం వైఎస్ హయాంలో అత్యంత వేగంగా ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా 3, 4, 5, 6 యూనిట్లు వేగంగా నిర్మించారు. వెరశి ఆర్టీపీపీకి 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తీసుకవచ్చారు. తద్వారా లో ఓల్టేజీ సమస్యకు చెక్ పడింది. 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు.. ఆర్టీపీపీలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలంటే సుమారు రోజుకు 21 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కానున్నట్లు యంత్రాంగం వివరిస్తోంది. టీడీపీ సర్కార్‌లో ఐదేళ్ల కాలంలో తరచూ బొగ్గు కొరత ఉత్పన్నం కావడంతో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ ముందు చూపుతో వ్యవహరించింది. ఒకేసారి 6లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీకి చేరాయి. దాంతో బొగ్గు కొరత అనే సమస్యే లేకుండా పోయిందని కార్మికవర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం 42వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఆర్టీపీపీలో సిద్ధంగా ఉన్నాయి. డిమాండ్ ప్రకారమే విద్యుత్ ఉత్పత్తి ఏపీ జెన్కో యాజమాన్యం సూచన మేరకు డిమాండ్‌ను బట్టి ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నాం. ప్రస్తుతం 6 యూనిట్లు ద్వారా ఉత్పత్తి కొనసాగుతోంది. బొగ్గు కొరత అనే సమస్యే తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఒకేసారి 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు చేరింది. ప్రస్తుతం ప్రతిరోజు 6నుంచి 7వ్యాగన్లు బొగు సరఫరా అవుతోంది. జెన్కో ఆదేశాల మేరకు 1650 మెగావాట్లుకు గాను 1450 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అన్ని యూనిట్ల ద్వారా ఏకధాటిగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. – మురళీకృష్ణా, సీఈ, ఆర్టీపీపీ -
ఆర్టీపీపీలో గంజాయి కలకలం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో బొగ్గును సరఫరా చేసే రైలు వ్యాగన్లో మంగళవారం గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆర్టీపీపీకి ఒడిశా, సింగరేణి నుంచి బొగ్గు వ్యాగన్లు వస్తాయి. మంగళవారం వచ్చిన వ్యాగన్ నుంచి లోడు దించుతుండగా సుమారు 10 కిలోలు ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వీటిని ఆర్టీపీపీ అధికారులు కలమల్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయంపై కలమల్ల ఎస్ఐ చంద్రమోహన్‌తో మాట్లాడగా గంజాయి ప్యాకెట్లను ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ అధికారులు స్టేషన్‌కు తెచ్చారన్నారు. ఇది మాకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎర్రగుంట్ల జీఆర్పీ వారిని వివరణ కోరగా ఆర్టీపీపీకి ప్రైవేటు రైల్వే లైన్ అయినందున తమకు సంబంధం లేదని వారు చెప్పారు. ఎస్ఈబీ సీఐ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి ప్యాకెట్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. గంజాయి ప్యాకెట్లు వ్యవహారంపై ఏ శాఖ అధికారులు సంబంధం లేదంటూ దాటేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. -
ఎన్టీపీసీ చేతికి ఆర్టీపీపీ?
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని ఏపీ జెన్కోకు చెందిన రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ) జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) చేతుల్లోకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని జెన్కో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆర్టీపీపీకి ఉన్న అప్పు మొత్తాన్ని ఎన్టీపీసీ చెల్లిస్తుందని తెలిపారు. తీవ్ర నష్టాలతో కునారిల్లుతున్న ఈ ప్లాంటు సంస్థకు భారమని భావించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. 210 మెగావాట్ల సామర్థ్యంతో 1994లో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రస్తుతం 1,650 మెగావాట్లకు విస్తరించింది. ఇందులో 600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆర్టీపీపీలో 1,500 మందికిపైగా శాశ్వత ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌లో మరో 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. విలీనమైతే శాశ్వత ఉద్యోగులు ఎన్టీపీసీలో కొనసాగుతారు. విలీనానికి కారణాలివీ ఆర్టీపీపీని ఆరంభం నుంచీ నష్టాలే వెంటాడుతున్నాయి. నాలుగు దశల ఈ ప్లాంట్‌కు రూ.5,520.76 కోట్ల అప్పులున్నాయి. దీనికి బొగ్గు ప్రధాన సమస్యగా మారుతోంది. మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) నుంచి బొగ్గు రవాణా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తాల్చేరు నుంచి కృష్ణపట్నం పోర్టుకు, అక్కడ్నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని ఆర్టీపీపీకి బొగ్గు రవాణా చేయాల్సి వస్తోంది. దీంతో చర వ్యయం విపరీతంగా పెరుగుతోంది. ప్రతీ యూనిట్‌కూ రూ.4.15 చొప్పున చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) చెల్లిస్తున్నారు. దీనికితోడు స్థిర వ్యయం (ఫిక్స్డ్ కాస్ట్) యూనిట్‌కు రూ.1.90 వరకూ ఉంటోంది. రెండూ కలిపి యూనిట్ విద్యుత్ రూ.6.05 అవుతోంది. ఏపీఈఆర్సీ నిబంధనల ప్రకారం తక్కువ ధర ఉన్న విద్యుత్‌నే ప్రోత్సహించాలి. ఈ కారణంగా ఇతర ప్లాంట్లు, పీపీఏలున్న విద్యుత్‌నే తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఉద్యోగుల వేతనాలూ ఇవ్వాలి. వీటికోసం ఆర్టీపీపీ కోసం అదనంగా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి, ప్రజలకు చౌక ధరలకు అందించే యోచనలో ఉంది. ఈ కారణంగా భవిష్యత్‌లోనూ ఆర్టీపీపీ మరింత భారమనే జెన్కో భావిస్తోంది. ఎన్టీపీసీకి లాభమేంటి? ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. కేంద్ర సంస్థ కావడం వల్ల బొగ్గు కొరత ఉండదు. అదీగాక ఎన్టీపీసీ థర్మల్తోపాటు సౌర విద్యుత్‌నూ ఉత్పత్తి చేస్తోంది. అనేక రాష్ట్రాలకు హైబ్రిడ్(సోలార్, థర్మల్ కలిపి) విద్యుత్ అందిస్తామని ఒప్పందాలు చేసుకుంది. ఈ కారణంగా ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సి వస్తుంది. ఆర్టీపీపీలో ఉత్పత్తి పెంచితే యూనిట్ ఫిక్స్డ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి చేసే వీలుంది. జరిగే ఉత్పత్తిని కూడా వినియోగంలోకి తెచ్చే వెసులుబాటూ ఎన్టీపీసీకి ఉంది. అయితే విలీనంపై విద్యుత్ ఉద్యోగ సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీపీపీ సిబ్బంది ఉద్యోగాల మాటేంటని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎన్టీపీసీ స్పష్టత ఇవ్వాలని పట్టుపడుతున్నాయి. ఉద్యోగ సంఘాల సందేహాలపై పూర్తి స్పష్టత ఇచ్చాకే ముందుకెళతామని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులకు ఢోకా లేదు: శ్రీకాంత్ ఆర్టీపీపీ ఎన్టీపీసీ చేతికెళ్లినా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. పైగా వాళ్లందరికీ ఎన్టీపీసీ స్కేల్ వర్తిస్తుందన్నారు. ఇప్పుడున్న అప్పంతా ఎన్టీపీసీకే బదలాయిస్తామని, దీనివల్ల జెన్కోకు భారం తగ్గుతుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి: ఇంజనీర్స్ అసోసియేషన్ ఆర్టీపీపీ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదించాలని ఇంజనీర్స్ అసోసియేషన్ జెన్కో విభాగం కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులకు అవసరమైన భద్రత కల్పించాల్సి ఉందన్నారు. తమతో చర్చిస్తే వాస్తవాలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగలమని చెప్పారు. -
ఆర్టీపీపీకి కోల్ కష్టాలు
సాక్షి, కడప: ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోవడం, తెలంగాణా రాష్ట్రంలోని సింగరేణి నుంచి అరకొరగా మాత్రమే వస్తుండటంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుదుత్పత్తి పడిపోయింది. 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 6వ యూనిట్లో శనివారం రాత్రి నుంచి విద్యుదుత్పత్తి నిలిపేశారు.ఆరుయూనిట్లలో ఇప్పటికే 2,5 యూనిట్లు పనిచేయడంలేదు. ప్రస్తుతం 1,3,4 యూనిట్ల పరిధిలో ఆదివారం నాటికి 510 మెగావాట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీపీలో ఆరు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1650 మెగావాట్లు. ఆరు యూనిట్లకు కలిపి ప్రతిరోజూ 20 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. ఒరిస్సా రాష్ట్రం తాల్చేరు ప్రాంతంలోని మహానది బొగ్గుగనుల నుంచి ప్రతిరోజూ 4 నుండి 5 రేక్స్(వ్యాగన్లు) బొగ్గు సరఫరా అయ్యేది. ఒక్కో రేక్ 3500 టన్నుల లెక్కన రోజూ 14 వేల నుంచి 16 వేల టన్నులు వచ్చేది.తెలంగాణలోని సింగరేణి నుంచి నిత్యం 3 రేక్స్(వ్యాగిన్లు) చొప్పున 10 వేల టన్నులకు తగ్గకుండా సరఫరా అయ్యేది. దీంతో ఆర్టీపీపీలో బొగ్గు సమస్య ఎప్పుడో కానీ తలెత్తేది కాదు. ఇక్కడ లక్ష టన్నుల వరకు బొగ్గు నిల్వలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. వర్షాలు, సమ్మెతో కష్టాలు ఒరిస్సాలో కార్మికుల సమ్మెకు వర్షాలు తోడుకావడంతో ఆర్టీపీపీకి రెండు వారాలుగా బొగ్గు సరఫరా పూర్తిగా నిలిచి పోయింది. తెలంగాణ నుంచి వెయ్యి టన్నులు మాత్రమే వస్తోంది.దీంతో 20 వేల టన్నులు అవసరమైన ఆర్టీపీపీలో పలు యూనిట్లలో విద్యుత్పత్తి నిలిపి వేయాల్సి వచ్చింది. ప్రధానంగా ఆరో యూనిట్లో శనివారం నుంచి అధికారులు ఉత్పత్తి నిలిపి వేశారు. జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె నేపథ్యంలో ఒరిస్సా నుంచి బొగ్గు సరఫరా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీంతో సింగరేణి నుంచి రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మరింత పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ సీఎంను కోరారు. ఉన్నత స్థాయి అధికారులు సైతం సింగరేణి నుంచి మరింత బొగ్గును తీసుకు వచ్చేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఐదు వేల టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. సింగరేణి నుంచి వచ్చే బొగ్గును శుభ్రం చేయకుండానే యూనిట్లకు తరలించాల్సి వస్తోంది. ఏ ఒక్కరోజు బొగ్గు సరఫరాకు ఆటంకం కలిగినా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఆర్టీపీపీ 1991లో ప్రారంభమైంది. 1995లో 1, 2 యూనిట్లలో విద్యుత్పత్తి ప్రారంభించారు. ఒక్కో యూనిట్ 210 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించారు. తర్వాత రెండవ దశలో 2004లో ఇదే సామర్థ్యంతో 3, 4 యూనిట్లకు విస్తరించారు. 2008లో 5వ యూనిట్‌ను ప్రారంభించారు. 600 యూనిట్ల సామర్థ్యంతో 6వ యూనిట్‌ను ఏడాది కిందట ప్రారంభించారు. వెంటనే ప్రభుత్వం తెలంగాణ నుంచి బొగ్గు సరఫరా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీపీపీ అధికారులు, కార్మికులు కోరుతున్నారు. -
కడప ఆర్టీపీపీలో ఉద్రిక్తత
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. సమాన పని- సమాన వేతనం ఇవ్వాలంటూ గత పదకొండు రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు దిగారు. అయితే వారి డిమాండ్ల్‌ను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా హెచ్చరికలు జారీ చేశారు. శనివారంలోపు విధుల్లో చేరకపోతే కొత్త వారిని తీసుకుంటామని బోర్డు డైరెక్టర్ సుందర్ సింగ్ ఉద్యోగులను హెచ్చరించారు. -
మెయింటెనెన్స్ పోస్టుల మోసం
► అంగట్లో సరుకులు లాగా అమ్మకాల జోరు ► ఒక్కో పోస్టుకు రూ.3లక్షలు పైగానే.. ► ఒక్క పోస్టు కూడా భర్తీ కాదంటున్న సీఈ ► ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులు జారీ ► నమ్మి మోసపోవద్దంటున్న ఆర్టీపీపీ సీఈ శ్రీరాములు ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో మెయింటెనెన్స్ పోస్టుల అమ్మకాల మాయాజాలం తాజాగా వేడిపుట్టిస్తోంది. చెట్టును చూపించి కాయలు అమ్మినట్లుగా అసలు ఇంతవరకు నోటిఫికేషన్ పడలేదు.. అసలు ఆ ఊసేలేదు.. కానీ కొందరు స్వార్థపరులు అత్యాశతో ఈ అమ్మకాల వ్యవహారానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే..త్వరలో ఆర్టీపీపీలో కాంట్రాక్టు పద్ధతిన మెయింటెనెన్స్ పోస్టుల భర్తీ జరుగుతుందని ప్రచారం రావడంతో వాటి కోసం రాజకీయ నాయకులు, కొన్ని కార్మిక సంఘాల నాయకులు కౌంటర్లను తెరిచారు. డబ్బులిస్తే పోస్టును వేయిస్తామంటూ లక్షలు వసూలు చేయడం ప్రారంభించారు. వారి హడావుడితో ఒక్కొక్క పోస్టు రూ.3లక్షలు పైగానే పలుకుతోంది. కొందరు అమాయకులు ఇప్పటికే వారి మాయమాటలకు బలైపోయారు. ఇదిగోఅదిగో అంటు డబ్బులు ఇచ్చిన వారికి దళారులు నానా కథలు చెబుతున్నారు. అధికారపార్టీ నేతలే దళారులు! గతంలో ఆర్టీపీపీలో మెయింటెనెన్స్ పోస్టులను భర్తీ చేశారు. అయితే అప్పుడు నానారభస జరిగి పోస్టుల భర్తీని నిలిపివేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారి టీడీపీ పాలన వచ్చింది. డబ్బులిస్తే పోస్టులు వేయిస్తామని కొందరు అధికారపార్టీ నాయకులు దళారుల అవతారం ఎత్తారు. వారితో పాటు ఆర్టీపీపీలో పనిచేసేవారు కూడా అమ్మకాల్లో ఉన్నారు. వీరి చేతిలో చాలామంది అమాయకులు మోసపోయారు. ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న వారే అనగా కార్మిక సంఘాలు నడుపుతున్న వారిలో కొందరు నేతలు కూడా పోస్టులు ఇప్పిస్తామని డబ్బులను వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఇటీవల పోస్టు ఇస్తామని నమ్మించి ఆర్టీపీపీలోని ఓ ఉద్యోగి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఓ బాధితుడు మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఆదేశాలు రాలేదు అసలు పోస్టులు భర్తీచేయాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి. తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాక ఏన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఏపీ జెన్కో తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టీపీపీలో మెయింటెనెన్స్ పోస్టులు భర్తీ జరగదని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెయింటెనెన్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ విషయం తెలియని అమాయకుల నుంచి దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులిచ్చి మోసపోవద్దు. ఆర్టీపీపీలో పోస్టుల భర్తీలేదని, ఎవరు కూడా దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. మెయింటైన్స్ పోస్టుల భర్తీ ఏపీజెన్కో, ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతాయి. ఆ పోస్టుల భర్తీలో కూడా భూనిర్వాసితులకు ప్రథమ ప్రా«ధ్యానత ఉంటుంది. మెయింటైన్స్ పోస్టుల భర్తీ ఇప్పట్లో లేదని అసలు భర్తీ జరగదు. దళారులను నమ్మి మోసపోయి డబ్బులు ఇవ్వొద్దు. –శ్రీరాములు, ఆర్టీపీపీ సీఈ, ఎర్రగుంట్ల -
బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడిగా శివరామిరెడ్డి
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామానికి చెందిన ఆర్టీపీపీ కాంట్రాక్టుర్ శివరామిరెడ్డి బీజేఎంఎం జిల్లా అ«ధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అదివారం విజయవాడలో జరిగిన బీజేఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ఆయనకు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేఎంఎం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో వృద్ధుడు మృతి
–వైద్యాధికారి లేకపోవడం వల్లే మృతి చెందాడంటూ వాదనకు దిగిన కార్మికులు – సీరియస్ అయితే నేరుగా పెద్దాసుపత్రికి వెళ్లొచ్చన్న వైద్యాధికారి ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చిలంకూరుకు చెందిన వృద్ధుడు ఎన్. శేషయ్య(68) గురువారం మృతి చెందాడు. సకాలంలో వైద్యా«ధికారి ఆస్పత్రికి రాకపోవడంతోనే చికిత్స అందక తన తండ్రి మృతి చెందాడని మృతుడి కుమారుడు శ్రీనివాసులు వాపోయాడు. కార్మికులు , స్థానికుల కథనం మేరకు .. చిలంకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆర్టీపీపీలోని మెయింటెనెన్స్ విభాగంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈఎస్ఐ కార్డు ఉంది. ఇతని తండ్రి శేషయ్యకు జ్వరం రావడంతో గురువారం తన భార్య మునిలక్ష్మితో కలసి చిలంకూరు నుంచి ఆటోలో ఎర్రగుంట్లలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికి అక్కడ వైద్యా«ధికారి లేడు. సిబ్బంది కూడా పట్టించుకోలేదు. కొద్ది సేపటికే శేషయ్య మృతి చెందాడు. తరువాత వైద్యాధికారి విష్టు వర్ధన్‌రెడ్డి రావడంతో అక్కడే ఉన్న కార్మికులు ‘మీరు ఆలస్యంగా రావడంతోనే శేషయ్య మృతి చెందాడని వాదనకు దిగారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈఎస్ఐ కార్డులు ఉన్న వారు సీరియస్ అయితే వెంటనే నేరుగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లొచ్చన్నారు. ఇక్కడ అత్యవసర మందులు లేవని తెలిపారు. ఎస్ఐ వెంకటనాయుడు ఆస్పత్రి వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. చివరకు మృతుడి బంధువులు మృతదేహాన్ని చిలంకూరు గ్రామానికి తీసుకెళ్లారు. -
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామ పరిధిలోని కృష్ణానగర్‌లో వెంకటసుబ్బమ్మ (30) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మైదుకూరు మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన చందా వెంకటస్వామి, వెంకటసుబ్బమ్మలు 2001లో కలమల్లకు వచ్చి కృష్ణానగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. వెంకటసుబ్బమ్మ ఆర్టీపీపీలో మెయింటైన్స్ ఉద్యోగం చేస్తోంది. వెంకటస్వామి కువైట్‌కు వెళ్లి వస్తూ ఉండేవాడు. నెల రోజుల కిందట భర్త కువైట్ నుంచి వచ్చాడు. ఇకపై కువైట్‌కు వెళ్లవద్దని భార్య తరచూ భర్తతో గొడవ పడుతుండేది. బుధవారం కూడా ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు.భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
ఆర్టీపీపీ ఉద్యోగిపై ఎస్పీఎఫ్ సిబ్బంది దాడి
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగి దివ్యనాథ్‌ను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్( ఎస్పీఎఫ్ ) ఎస్ఐ శివతో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. డబ్బుల కోసం ఆర్టీపీపీలోని ఆంధ్రా బ్యాంక్ వద్ద బుధవారం క్యూలో నిలబడి ఉన్న ఉద్యోగుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఉద్యోగులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో దివ్యనాథ్ అనే ఉద్యోగిని ఎస్పీఎఫ్ సిబ్బంది లాఠీలతో చితకబాదారు. కాగా, ఎస్పీఎఫ్ ఎస్ఐ శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలమల్ల పోలీసులు దివ్యనాథ్ అనే ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వెంటనే ఉద్యోగిని విడుదల చేయాలని కోరుతూ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగి గేటును మూసి వేశారు. ఈ ఆందోళన బుధవారం రాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగి దివ్యనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీఎఫ్ ఎస్ఐ శివపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. దీంతో ఉద్యోగులు శాంతించారు. -
ఆర్టీపీపీలో విద్యుత్‌కు అంతరాయం
వైఎస్సార్ జిల్లా: ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్‌ప్లాంట్(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. ఆర్టీపీపీలోని మూడవ యూనిట్లో ఆయిల్ లీకేజీ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 215 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీని వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. -
ఆర్టీపీపీకి ఆగిన నీటి సరఫరా
రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా ఆగి పోయింది. విద్యుదుత్పత్తికి బ్రహ్మంసాగర్ నుంచి నీరు సరఫరా చేసే పైపులైన్ ఊహించని రీతిలో దెబ్బతింది. వివరాలివీ.. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి 68 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. చాపాడు మండలంలోని కుందూ, ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నదులపై ఈ పైపులైన్ వస్తోంది. దీని ద్వారా ఆర్టీపీపీకి రోజు 38 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. గురువారం సాయంత్రం పెన్నానదిలోని పైపులైన్‌కు సంబంధించి ఎక్స్పాన్షన్ జాయింట్ ఊడిపోయింది. తీవ్ర ఒత్తిడి ప్రభావం కారణంగా ఈ జాయింట్ ఊడిపోయి నీరు పెన్నానదిలోకి చేరింది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేస్తే తప్ప పైపులైన్ నిర్మాణం యధాస్థితికి రాదని తెలుస్తోంది. -
యువకుని అనుమానాస్పద మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామ శివారులోని వరి పొలాల్లో సోమవారం ఉదయం యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన కిష్టయ్య, చెన్నమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ(22) ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాల్లో విగతజీవి అయి కనిపించాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ అశోక్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిపివేత
విద్యుత్ కు డిమాండ్ తగ్గిపోవడంతో... వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో గురువారం మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో 1, 3, 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని అధికారులు తెలిపారు. 2, 4 యూనిట్లలో ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని వివరించారు. -
ఆర్టీపీపీలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో ఆదివారం నాటికి బొగ్గు నిల్వలు 1.25 లక్ష టన్నులకు చేరుకున్నాయి. గతంలో బొగ్గు కొరత ఏర్పడి ఒకానొక దశలో ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అందుకు భిన్నంగా సుమారు 1.25 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు తెలిపారు. ఆర్టీపీపీలోని 1, 2, 3, 4, 5 యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, 1,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. -
ఆర్టీపీపీలో దొంగలుపడ్డారు
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్న వీవీరెడ్డి కాలనీలో శనివారం రాత్రి భారీ చోరీలు జరిగాయి. కాలనీలోని జీ టైప్ క్వార్టర్స్‌లో 9 ఇళ్లలో దొంగతనం జరిగింది. తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పని కానిచ్చేశారు. కొన్ని ఇళ్లకు గడియలు కట్ చేసి, మరికొన్నింటికి చిలుకులు విరగ్గొట్టి, ఇంకొన్నింటికి తాళాలు పగుల కొట్టి బంగారు, నగదును అపహరించారు. ఆర్టీపీపీలో నిత్యం ఎస్పీఎఫ్ తిరుగుతున్నా, కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉన్నా కాలనీలోని క్వార్టర్స్‌లో భారీగా చోరీలు జరగడం ఇదే మొదటి సారి. జీ-టైప్‌లోని 103, 104, 106, 107, 110, 112, 116, 291, 314 ఇళ్లలో చోరీ చేశారు. ఇటీవల జువారిలో కాలనీలో జరిగిన మాదిరిగానే ఇక్కడ జరిగినట్టు పోలీ సులు, అధికారుల అభిప్రాయ పడుతున్నారు. సుమారు 45 తులాల బంగారు, అర్ధ కిలో వెండి చోరీ జరిగినట్లు ఎర్రగుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి తెలిపారు. జీ-టైపులోని 106 నంబరు గల ఇం టిలో సునీల్‌కుమార్‌రెడ్డి, సుమలత నివాసంటున్నారు. పని మీద సునీల్ కుమార్‌రెడ్డి తల్లితో కలసి సొంత ఊరికిపోయా రు. సుమలత తన అన్న ఇంటికి వెళ్లింది. దొంగలు పడి సుమారు 20 తులాల బంగారుతోపాటు రూ.20 వేల డబ్బులు తీసుకెళ్లినట్లు బాధితులు వాపోయారు. 107 ఇంటిలో దాస్ (జెపీఏ), ప్రభావతి నివాసంటున్నారు. శనివారం సొంత గ్రామమైన చిలంకూరుకు పోయినారు. ఈ ఇంటిలో రూ.2 వేలతో పాటు కమ్మలు దొంగిలించినట్లు వారు తెలిపారు. 110 నంబరు గల ఇల్లు కిరణ్‌కుమార్‌రెడ్డిది. ఇందులో 15 తులాలు బంగారు, అర్ధ కిలో వెండి పోయినట్లు ఆయన పేర్కొన్నారు. 104 నంబరు గల తన ఇంటిలో బంగారు హారం పోయిందని ప్రమీళ జ్వోతి తెలిపారు. 112 నంబరు గల ఇంటిలో రూ.5 వేల నగదుతోపాటు బంగారు పోయిందని పక్కీరమ్మ చెప్పారు. 103 నంబరు గల ఇంటిలో నివాసంటున్న లక్ష్మీదేవి దేవర ఉంటే ఊడగండ్లుకు పోయింది. ఈమె ఇంటిలో రెండు ఉంగరాలు, జత కమ్మలు, రెండు డాల ర్సు, రూ. 5 వేలు డబ్బులు పోయినవి. 291 నంబరు గల ఇంటిలో చిన్నమోషా నివాసంటున్నాడు. పని మీద తాడిపత్రికి పోయినాడు. ఈ ఇంటిలో సుమారు రూ45 వేలతో పాటు బంగారు పోయింది. 116 ఇంటిలో క్రిష్ణాప్రసాద్ ఉంటున్నాడు. ఈ ఇంటిలో కూడా బంగారు, డబ్బు పోయింది. 314 నంబరు గల ఇంటిలో ఎం.శంకర్ నివసిస్తున్నాడు. వీరింటిలో బంగారు పోయింది. పరిశీలించిన ఆర్టీపీపీ సీఈ, సీసీఎస్ డీఎస్పీ... ఆర్టీపీపీ సీఈ కుమార్బాబుతోపాటు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ పీటీ కేశవరెడ్డి, సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐలు హేమాద్రి, శ్రీనివాసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐని అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులను ఏ విధంగా పగల కొట్టినారో పరి శీలించారు. ఇది అనుభవం గల దొంగల పని అని అభిప్రాయ పడ్డారు. అన్ని కోణా ల్లో పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. తరువాత కడప నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది 9 ఇళ్లలో పడిన వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు. సరస్వతీ శిశు మందిరం వద్ద ఆగిన డాగ్ స్క్వాడ్ చోరీలను ఛేదించడానికి కడప నుంచి డాన్ అనే డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ డాన్ చోరీ జరిగిన సంఘటన స్థలంలోని వస్తువుల వాసనను పట్టి నేరుగా కాలనీలోకి పోయి ఫౌంటెన్ వద్ద నుంచి పరుగులు తీసింది. కాలనీలోని పై భాగంలో ఉన్న సరస్వతీ శిశు మందిరం వద్దకు పోయి అక్కడ కలయతిరిగి ఒక చోట కూర్చుంది. -
పొరపాట్లు దిద్దుకుంటాం
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో లోపాలను పొరపాట్లును సరిదిద్దుకుంటామని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. సోమవారం ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదం నేపధ్యంలో ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఏడీఈ నాగేంద్ర మృతి బాధకరమని, సెఫ్టీ నియమాలను జెన్కోలోని అన్ని స్టేషన్లో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆర్టీపీపీ అధికారులు, గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆరో యూనిట్‌లోని బాయిల్, చిమ్నీ, ఈఎస్పీ, టర్బెన్ పనులను పరిశీలించారు. అనంతరం సీఈ చాంబర్లో విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో పరిధిలో ఇంత ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పరిశీలించి పొరపాట్లు సరిచేసుకుంటామని చెప్పారు. ఈ సంఘనపై ప్రత్యేకంగా కమిటీ వేస్తామని చెప్పారు. ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు... ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంపై జెన్కో డెరైక్టర్ బలరాం ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని నియామించినట్లు చెప్పారు. ఈ కమిటీలో జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ రెండు వారాల లోగా అన్ని కోణాలలో విచారణ చేసి పూర్తి సమాచరంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సెఫ్టీ పాటించకపోతే లోనికి రాన్వికండి... ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగాలు, అధికారులు, కార్మికులు ఏవరైనా సరై సెఫ్టీ నియమాలు పాటించకపోతే లోనికి రాన్వివద్దని జెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. ఆర్టీపీపీలోని ఆరో యూనిట్లో అన్ని చోట్ల సెఫ్టీకి సంబంధించి బోర్టులు ఉంచాలని సూచించారు. ప్రధానంగా గేటు వద్ద పర్యవేక్షణ చేసి సెఫ్టీ లేకపోతే బయటకు పంపాలని ఆదేశించారు. ప్రాజె క్ట్ పనులలో ప్రత్యేకంగా సెఫ్టీపై పర్యవేక్షణ అధికారులను నియమిస్తామన్నారు. ఎస్ఈలు ఈ సెఫ్టీపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌లలో అదనంగా అంబులెన్సుల సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. నష్టపరిహారంతో గాయపడిన కార్మికులకు సాయంగా నిలుస్తాం ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు కంపెనీ ఇస్తున్న నష్టపరిహారంతో పాటు జెన్కో బోర్డు కూడా అందిస్తుందన్నారు. గాయపడిన కార్మికులకు వైద్య ఖర్చులను బోర్టు భరిస్తుందన్నారు. ముఖ్య మంత్రి సంతాపం.. ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ఆర్టీపీపీ బొగ్గు కొరతను అధిగమిస్తాం. ఆర్టీపీపీలోని బొగ్గు కొరతను త్వరలోనే అధిగమిస్తామని ఆయన అన్నారు. 15 రోజులకు అవసరమైన బొగ్గు ఉండాలని, అరుుతే కొరత కారణంగా ప్రస్తుతం ఏరోజుకారోజు అన్నట్లు నడుస్తోందన్నారు. క్రిష్ణపట్నంకు బొగ్గు తరలిపోతోందని, అలాగే విజయవాడ బొగ్గును ఆర్టీపీపీకి ఇస్తున్నామని చెప్పారు. సింగరాణి నుంచి 1 మిలియన్ బొగ్గు ఇక్కడికి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే ఆర్టీపీపీలో 20 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడ కూడా కోతలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో డెరైక్టరు బలరాం, జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు, ఎస్ఈలు శేషారెడ్డి, శ్రీధర్‌బాబు, రామముత్యలరావు, రామసుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నర్సంహరావు, దేవేంద్రనాయక్లు, సంక్షేమ శాఖ అధికారి తిరుమల రావు, ఎస్పీఎఫ్ కమాడెంట్ మునిరాజ, ఆర్ఐ ఉస్సేనయ్య, కలమల్ల ఎస్ఐ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. -
అవినాష్ రెడ్డి దీక్షకు దిగి వచ్చిన ఆర్టీపీపీ
-
అవినాష్ రెడ్డి దీక్షకు దిగి వచ్చిన ఆర్టీపీపీ
కడప : భూ నిర్వాసితుల కోసం కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి చేపట్టిన దీక్షకు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) యాజమాన్యం దిగివచ్చింది. ఆర్టీపీపీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అవినాష్ రెడ్డితో చర్చలు జరిపారు. భూ నిర్వాసితుల డిమాండ్ మేరకు జనవరి 1 లోపు 96 ఉద్యోగాలు ఇస్తామని డైరెక్టర్ చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రైతులు దీక్ష విరమించారు. ఆర్టీపీపీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో భూ నిర్వాసితులు రిలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతు పలికారు. యాజమాన్యం దిగి రాకపోవటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీక్షకు దిగారు. -
ఆర్టీపీపీ వద్ద ఎంపీ అవినాస్ రెడ్డి దీక్ష
-
ఆర్టీపీపీ వద్ద వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాస్ రెడ్డి దీక్ష
కడప : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ)లో భూ నిర్వాసితుల కోసం కడప వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి మంగళవారం దీక్షలు చేపట్టారు. ఆర్టీపీపీ, భూములు కోల్పోయిన రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో భూ నిర్వాసితులు రిలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గత 15 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలకు ఎంపీ అవినాష్ రెడ్డి మద్దతు పలికారు. యాజమాన్యం దిగి రాకపోవటంతో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే ఏపీ జెన్కో ఎండీ, డైరెక్టర్లతో మాట్లాడినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. భూ నిర్వాసితుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయన్నారు. -
భూ నిర్వాసితుల దండయాత్ర
ఆర్టీపీపీ ముట్టడి ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ) ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైన ఆర్టీపీపీ యాజమాన్యం వైఖరిని తప్పుబడుతూ భూ నిర్వాసితులు శుక్రవారం దండయాత్ర చేశారు. ఇక్కడి 600 మెగావాట్ల ప్రాజెక్ట్ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒక దశలో తోపులాట జరగడంతో ఏం జరుగుతోందోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. న్యాయం చేయమంటే కేసులా? ఆర్టీపీపీలో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చినందుకు ప్రతిఫలంతో పాటు నిర్వాసిత కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరితే కేసులు పెడతామంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ గేటు తాళాలు వేసి లోపలికి ఎవరూ పోకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు ఎస్ఈ శేషారెడ్డిని ఆందోళనకారుల వద్దకు చర్చల కోసం పంపారు. ఆయన సుధీర్‌రెడ్డి సమక్షంలో రైతులతో చర్చించారు. రైతుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ఏపీ జెన్కో సానుకూలంగా ఉందన్నారు. ఏపీ జెన్కో డెరైక్టర్ వచ్చి రైతులతో మాట్లాడుతారని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. కలమల్ల గ్రామ సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ పద్మనాభయ్య, ఎమ్మర్పీఎస్ నాయకుడు వెంకటేశ్, వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వరరెడ్డి, పులి సుధాక ర్‌రెడ్డి, బీఎంఎస్ నాయకుడు గంగయ్య, ఏఐటీయూసీ నాయకులు పొన్న శివయ్య, సీఐటీయూ నాయకులు రామ్మోహన్, ఎంపీటీసీ సభ్యులు ప్రతాప్, ఎస్.ముస్తాఫ్, 1104 యూనియన్ నాయకుడు మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
వేటుకు సిద్ధం..!
ఎర్రగుంట్ల: తమ అనుయాయులకు ఆర్టీపీపీలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నేతలు ప్రస్తుతం ఆర్టీపీపీలో పనిచేస్తున్న 200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీపీపీలో సుమారు 2500 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇందులో 1100 మంది ఉద్యోగులు, సుమారు 900 మంది కాంట్రాక్టు కార్మికులు, మిగిలిన వారు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత తొమ్మిదేళ్ల కాలంలో ఆర్టీపీపీలో ఏ ఒక్క కార్మికుడిని తొలగించిన దాఖలాలు లేవు. టీడీపీ అధికారంలోకి రావడంతో తమ అనుయాయులకు అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు ఓ ఎంపీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జెన్కో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీజెన్కో డైరక్టర్ ఒకరు పదిరోజుల క్రితం వచ్చి ఆర్టీపీపీలో ఎవరు నిర్లక్ష్యంగా డ్యూటీలు చేస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వెళ్లిపోయారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులలో గుబులు రేగుతోంది. ఒకరిని తొలగించినా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ జెన్కో ఎండీ విజయానంద్‌ను వివరణ కోరగా ఆర్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులతో బాటు కాంట్రాక్ట్ కార్మికులలో ఏ ఒక్కరినీ తొలగించమన్నారు. -
ఆర్టీపీపీ.. ఉత్పత్తి అరకొర
ఎర్రగుంట్ల : వైఎస్ఆర్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) లో బొగ్గు కొరత కారణ ంగా ఉత్పత్తి 40 శాతానికి పడిపోయింది. చేసేదేమీ లేకపోవడంతో ఓవ్‌రాలింగ్ పేరుతో అధికారులు ఓక్కోసారి ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తున్నారు. కొద్ది రోజులు కిందట 20వేల టన్నుల వరకు బొగ్గు నిల్వ ఉండేది. అది ప్రస్తుతం ఐదువేల టన్నుల కు పడిపోయింది. రాష్ట్రాల విభజన జరగడంతో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు తరచు బొగ్గు గండం ఏర్పడుతోంది. దీంతో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి స్తంభించే స్థాయికి ఆర్టీపీపీ చేరుకుంటోంది. ఆర్టీపీపీలో 1,2,3,4,5 యూనిట్లులో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. బొగ్గు కొరత వల్ల యూనిట్లు ఒకదాని తర్వాత ఒకటి ఓవ్‌రాలింగ్ పేరుతో నిలుపుదల చేస్తున్నారు. 15 రోజుల కిందట 1వ యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు నిమిత్తం నిలుపుదల చేశారు. ఈ యూనిట్‌ను గురువారం సర్వీసులోకి తీసుకున్నారు. ఇంతలో మరో యూనిట్‌ను ఓవ్‌రాలింగ్ పనులు కోసం నిలుపుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచరం. దీన్ని బట్టి చూస్తే బొగ్గు కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మిగిలిన యూనిట్లలో కూడా కేవలం 150 చొప్పున 600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. -
ఆర్టీపీపీపై సవతి ప్రేమ
- ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయండి - సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమకు మణిహారంగా నిలుస్తున్న ఆర్టీపీపీకి అవసరమైన బొగ్గు సరఫరాలో సవతిప్రేమ చూపొద్దని, జెన్కో సంస్థతో చేసుకున్న అగ్రిమెంటు మేరకు బొగ్గు సరఫరా చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఎండీ సుతిత్రభట్టాచార్యకు సోమవారం లేఖ రాశారు. 1050 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేక యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆయన వివరించారు. జెన్కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా, ఆమేరకు బొగ్గు సరఫరా కావడం లేదని అవినాష్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు. జెన్కోలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆర్టీపీపీ ఏరోజుకారోజు బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపరిణామానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్సీసీఎల్ కారణంగా ఉత్పత్తి ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఎస్సీసీఎల్ ఛెర్మైన్‌కు రాసిన లేఖలో తెలిపారు. -
RTPPలో బొగ్గు కొరత
-
సమ్మెతో పల్లెల్లో చీకట్లు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో ఉద్యోగుల మెరుపు సమ్మెతో పల్లెల్లో చీకట్లు అలుముకున్నాయి. సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడడంతో పవర్ గ్రిడ్ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లెలకు కరెంట్ కట్ చేశారు. వేతన సవరణ కమిటీ వేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఆదివారం ఉద్యోగుల సెలవురోజు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. సోమవారం నాటికి ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో దాదాపు 2 నుంచి 3 గంటలకు పైగా కోత విధించారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 గంటల పాటు కోత విధించారు. పల్లెల్లో ఉదయం పోయిన కరెంట్ రాత్రి 11 గంటల వరకూ రాలేదు. 63 మండలాల పరిధిలోని పలు పల్లెలో చీకట్లు అలుముకున్నాయి. శనివారం ట్రాన్స్‌కో ఉద్యోగులతో విద్యుత్ సంస్థలు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. సోమవారం మరోమారు చర్చలు జరుపుతారని, దాదాపు ఈ చర్చలు ఫలిస్తాయని ట్రాన్స్‌కో జిల్లా ఉన్నతాధికారులు భావించినా.. సాయంత్రం వరకు చర్చలు జరపలేదు. పల్లెలకు కరెంట్ సరఫరా నిలిపివేత విషయంపై ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్పత్తి లోటు ఏర్పడడం వలన కరెంట్ సరఫరా చేస్తే లోడ్ ఎక్కువై గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశముందని, దీంతో పల్లెలు, పట్టణాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని వివరించారు. కాగా, సోమవారం రాత్రి చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. -
కరెంటు.. ఇక్కట్లు
సాక్షి, కడప : అసలే విద్యుత్ కోతలు, ఆపై విద్యుత్ సమ్మె. వెరసి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సంక్షోభం నెలకొంది. ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆదివారం రాత్రి నుంచే ఆగిపోయింది. దీంతోపాటు రాష్ట్రంలోని వీటీపీఎస్, కేటీపీఎస్, శ్రీశైలం కుడిగట్టు వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే సోమవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమ్మె కొనసాగిఉంటే జిల్లాలోని అత్యవసర సేవలకు సైతం తీవ్ర విఘాతం కలిగేది. ఇప్పటికే పరిశ్రమలకు పూర్తి స్థాయిలో అధికారులు కోత విధించారు. జిల్లాకు రావాల్సిన కోటా కంటే 50 శాతం తక్కువగా విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో వాణిజ్య, గృహావసరాలకు సైతం కోతలను పెంచారు. సమ్మె విరమణ జరిగి ఉండకపోతే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉండేదని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. విధులను బహిష్కరించిన ఉద్యోగులు వేతన సవరణకు సంబంధించి అగ్రిమెంటుపై ప్రభుత్వం తరపున అధికారులు సంతకం చేయాలని విద్యుత్ జేఏసీ చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ నరసింహారావులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఆపరేషన్స్‌కు సంబంధించి రెండు వేల మంది, ట్రాన్స్‌కో ఉద్యోగులు వెయ్యి మంది, ఆర్టీపీపీలో 2500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో కలుపుకుని పూర్తి స్థాయిలో అందరూ సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లా కేంద్రంలోని శంకరాపురం 220 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట, ఆర్టీపీపీలో ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. -
బ్రహ్మంసాగర్‌లో డెడ్ స్టోరేజి
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గింది. సాగర్ నీటి సామర్థ్యం 17.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.3 టీఎంసీలు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజి ఉన్నా ఆర్టీపీపీకి మాత్రం బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి 40 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది పాలకుల నిర్లక్ష్యం వలన బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది సాగుకు నీరు వస్తుందా రాదా అనేది రైతుల్లో ఆందోళన నెలకొంది. బ్రహ్మంసాగర్‌లో నీటి కొరత ఉన్నా అధికారులు మాత్రం సాగర్ కుడికాలువ ద్వారా ఆర్టీపీపీకి మాత్రం మరో టీఎంసీ నీటిని విడుదల చేయమని ఉత్తర్వులు ఇవ్వడంతో నెల రోజులుగా ప్రతి రోజు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. 1.46 టీఎంసీ నీరు నిల్వ ఉన్నంత వరకు ఆర్టీపీపీకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. బ్రహ్మంసాగర్‌కు ఇంకా నీరు రాకపోవడంతో రైతులు వరి పంటను సాగు చేసుకునేందుకు నీరును ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు పోతిరెడ్డిపాడుకు నీరు చేరకపోవడంతో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరాలంటే మరో 20 రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదైనా సాగర్ నీటి సామర్థ్యంలో కనీసం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.