
సాక్షి, కడప : వైఎస్‌ఆర్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. సమాన పని- సమాన వేతనం ఇవ్వాలంటూ గత పదకొండు రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నాకు దిగారు. అయితే వారి డిమాండ్ల్‌ను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాకుండా హెచ్చరికలు జారీ చేశారు. శనివారంలోపు విధుల్లో చేరకపోతే కొత్త వారిని తీసుకుంటామని బోర్డు డైరెక్టర్ సుందర్ సింగ్ ఉద్యోగులను హెచ్చరించారు.