ఎర్రగుంట్ల: మండల పరిధిలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్న వీవీరెడ్డి కాలనీలో శనివారం రాత్రి భారీ చోరీలు జరిగాయి. కాలనీలోని జీ టైప్ క్వార్టర్స్‌లో 9 ఇళ్లలో దొంగతనం జరిగింది. తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పని కానిచ్చేశారు. కొన్ని ఇళ్లకు గడియలు కట్ చేసి, మరికొన్నింటికి చిలుకులు విరగ్గొట్టి, ఇంకొన్నింటికి తాళాలు పగుల కొట్టి బంగారు, నగదును అపహరించారు.
ఆర్టీపీపీలో నిత్యం ఎస్‌పీఎఫ్ తిరుగుతున్నా, కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉన్నా కాలనీలోని క్వార్టర్స్‌లో భారీగా చోరీలు జరగడం ఇదే మొదటి సారి. జీ-టైప్‌లోని 103, 104, 106, 107, 110, 112, 116, 291, 314 ఇళ్లలో చోరీ చేశారు. ఇటీవల జువారిలో కాలనీలో జరిగిన మాదిరిగానే ఇక్కడ జరిగినట్టు పోలీ సులు, అధికారుల అభిప్రాయ పడుతున్నారు. సుమారు 45 తులాల బంగారు, అర్ధ కిలో వెండి చోరీ జరిగినట్లు ఎర్రగుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి తెలిపారు.
జీ-టైపులోని 106 నంబరు గల ఇం టిలో సునీల్‌కుమార్‌రెడ్డి, సుమలత నివాసంటున్నారు. పని మీద సునీల్ కుమార్‌రెడ్డి తల్లితో కలసి సొంత ఊరికిపోయా రు. సుమలత తన అన్న ఇంటికి వెళ్లింది. దొంగలు పడి సుమారు 20 తులాల బంగారుతోపాటు రూ.20 వేల డబ్బులు తీసుకెళ్లినట్లు బాధితులు వాపోయారు.
107 ఇంటిలో దాస్ (జెపీఏ), ప్రభావతి నివాసంటున్నారు. శనివారం సొంత గ్రామమైన చిలంకూరుకు పోయినారు. ఈ ఇంటిలో రూ.2 వేలతో పాటు కమ్మలు దొంగిలించినట్లు వారు తెలిపారు.
110 నంబరు గల ఇల్లు కిరణ్‌కుమార్‌రెడ్డిది. ఇందులో 15 తులాలు బంగారు, అర్ధ కిలో వెండి పోయినట్లు ఆయన పేర్కొన్నారు.
104 నంబరు గల తన ఇంటిలో బంగారు హారం పోయిందని ప్రమీళ జ్వోతి తెలిపారు.
112 నంబరు గల ఇంటిలో రూ.5 వేల నగదుతోపాటు బంగారు పోయిందని పక్కీరమ్మ చెప్పారు.
103 నంబరు గల ఇంటిలో నివాసంటున్న లక్ష్మీదేవి దేవర ఉంటే ఊడగండ్లుకు పోయింది. ఈమె ఇంటిలో రెండు ఉంగరాలు, జత కమ్మలు, రెండు డాల ర్సు, రూ. 5 వేలు డబ్బులు పోయినవి.
291 నంబరు గల ఇంటిలో చిన్నమోషా నివాసంటున్నాడు. పని మీద తాడిపత్రికి పోయినాడు. ఈ ఇంటిలో సుమారు రూ45 వేలతో పాటు బంగారు పోయింది.
116 ఇంటిలో క్రిష్ణాప్రసాద్ ఉంటున్నాడు. ఈ ఇంటిలో కూడా బంగారు, డబ్బు పోయింది.
314 నంబరు గల ఇంటిలో ఎం.శంకర్ నివసిస్తున్నాడు. వీరింటిలో బంగారు పోయింది.
పరిశీలించిన ఆర్టీపీపీ సీఈ, సీసీఎస్ డీఎస్పీ...
ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబుతోపాటు కడప సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ పీటీ కేశవరెడ్డి, సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు హేమాద్రి, శ్రీనివాసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీ జరిగిన తీరును సీఐని అడిగి తెలుసుకున్నారు. ఇంటి తలుపులను ఏ విధంగా పగల కొట్టినారో పరి శీలించారు. ఇది అనుభవం గల దొంగల పని అని అభిప్రాయ పడ్డారు. అన్ని కోణా ల్లో పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. తరువాత కడప నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది 9 ఇళ్లలో పడిన వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హేమాద్రి తెలిపారు.
సరస్వతీ శిశు మందిరం వద్ద ఆగిన డాగ్ స్క్వాడ్
చోరీలను ఛేదించడానికి కడప నుంచి డాన్ అనే డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ డాన్ చోరీ జరిగిన సంఘటన స్థలంలోని వస్తువుల వాసనను పట్టి నేరుగా కాలనీలోకి పోయి ఫౌంటెన్ వద్ద నుంచి పరుగులు తీసింది. కాలనీలోని పై భాగంలో ఉన్న సరస్వతీ శిశు మందిరం వద్దకు పోయి అక్కడ కలయతిరిగి ఒక చోట కూర్చుంది.
ఆర్టీపీపీలో దొంగలుపడ్డారు
Published Tue, Mar 3 2015 2:43 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement