ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో లోపాలను పొరపాట్లును సరిదిద్దుకుంటామని ఏపీజెన్‌కో ఎండీ విజయానంద్ అన్నారు. సోమవారం ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదం నేపధ్యంలో ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఏడీఈ నాగేంద్ర మృతి బాధకరమని, సెఫ్టీ నియమాలను జెన్‌కోలోని అన్ని స్టేషన్‌లో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆర్టీపీపీ అధికారులు, గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆరో యూనిట్‌లోని బాయిల్, చిమ్నీ, ఈఎస్‌పీ, టర్బెన్ పనులను పరిశీలించారు. అనంతరం సీఈ చాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో పరిధిలో ఇంత ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పరిశీలించి పొరపాట్లు సరిచేసుకుంటామని చెప్పారు. ఈ సంఘనపై ప్రత్యేకంగా కమిటీ వేస్తామని చెప్పారు.
ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు...
ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంపై జెన్‌కో డెరైక్టర్ బలరాం ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని నియామించినట్లు చెప్పారు. ఈ కమిటీలో జెన్‌కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ రెండు వారాల లోగా అన్ని కోణాలలో విచారణ చేసి పూర్తి సమాచరంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
సెఫ్టీ పాటించకపోతే లోనికి రాన్వికండి...
ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగాలు, అధికారులు, కార్మికులు ఏవరైనా సరై సెఫ్టీ నియమాలు పాటించకపోతే లోనికి రాన్వివద్దని జెన్‌కో ఎండీ విజయానంద్ అన్నారు. ఆర్టీపీపీలోని ఆరో యూనిట్‌లో అన్ని చోట్ల సెఫ్టీకి సంబంధించి బోర్టులు ఉంచాలని సూచించారు. ప్రధానంగా గేటు వద్ద పర్యవేక్షణ చేసి సెఫ్టీ లేకపోతే బయటకు పంపాలని ఆదేశించారు. ప్రాజె క్ట్ పనులలో ప్రత్యేకంగా సెఫ్టీపై పర్యవేక్షణ అధికారులను నియమిస్తామన్నారు. ఎస్‌ఈలు ఈ సెఫ్టీపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌లలో అదనంగా అంబులెన్సుల సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు.
నష్టపరిహారంతో గాయపడిన కార్మికులకు సాయంగా నిలుస్తాం
ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు కంపెనీ ఇస్తున్న నష్టపరిహారంతో పాటు జెన్‌కో బోర్డు కూడా అందిస్తుందన్నారు. గాయపడిన కార్మికులకు వైద్య ఖర్చులను బోర్టు భరిస్తుందన్నారు.
ముఖ్య మంత్రి సంతాపం..
ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారని ఏపీజెన్‌కో ఎండీ విజయానంద్ అన్నారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని సీఎం చెప్పారని ఆయన తెలిపారు.
ఆర్టీపీపీ బొగ్గు కొరతను అధిగమిస్తాం.
ఆర్టీపీపీలోని బొగ్గు కొరతను త్వరలోనే అధిగమిస్తామని ఆయన అన్నారు. 15 రోజులకు అవసరమైన బొగ్గు ఉండాలని, అరుుతే కొరత కారణంగా ప్రస్తుతం ఏరోజుకారోజు అన్నట్లు నడుస్తోందన్నారు. క్రిష్ణపట్నంకు బొగ్గు తరలిపోతోందని, అలాగే విజయవాడ బొగ్గును ఆర్టీపీపీకి ఇస్తున్నామని చెప్పారు. సింగరాణి నుంచి 1 మిలియన్ బొగ్గు ఇక్కడికి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
త్వరలోనే ఆర్టీపీపీలో 20 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడ కూడా కోతలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజెన్‌కో డెరైక్టరు బలరాం, జెన్‌కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు, ఎస్‌ఈలు శేషారెడ్డి, శ్రీధర్‌బాబు, రామముత్యలరావు, రామసుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నర్సంహరావు, దేవేంద్రనాయక్‌లు, సంక్షేమ శాఖ అధికారి తిరుమల రావు, ఎస్‌పీఎఫ్ కమాడెంట్ మునిరాజ, ఆర్‌ఐ ఉస్సేనయ్య, కలమల్ల ఎస్‌ఐ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు దిద్దుకుంటాం
Published Wed, Dec 31 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement