Balaram
-
Ayodhya Ram Mandir: బాలరాముడి తొలి దర్శనం
అయోధ్య/న్యూఢిల్లీ: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రాణప్రతిష్ట కంటే ముందే రామ్‌లల్లా విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గర్భగుడిలోకి చేర్చకముందు వీటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాలరాముడి చేతిలో బాణం, విల్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నల్లరాయితో రూపొందించిన ఐదు సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ విధంగా రామ్‌లల్లా విగ్రహ తొలి దర్శనం ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రజలకు లభించింది. ఇక గర్భగుడిలో ప్రధాన వేదికపై ప్రతిష్టించిన తర్వాత కళ్లకు గంతలు కట్టి ఉన్న రామ్‌లల్లా విగ్రహం ఫొటోను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విడుదల చేసింది. ప్రాణప్రతిష్ట పూర్తవకపోవడంతో విగ్రహం కళ్ల చుట్టూ పసుపు రంగు వస్త్రం చుట్టారు. రామ్‌లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణప్రతిష్ట ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు. ఏర్పాట్లపై సీఎం యోగి సమీక్ష ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలోని హనుమా న్ గార్హీ ఆలయంలో పూజలు చేశారు. అలాగే భవ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం జరుగుతున్న ఏర్పాట్లు సమీక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత సరయూ నదిలో సోలార్ బోటును ప్రారంభించారు. 1,008 కుండియా హనుమాన్ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. కాలర్ ట్యూన్లుగా రాముని పాటలు రామాలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాతి్మక వాతావరణం కనిపిస్తోంది. వీధుల్లో రాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రజలు పరస్పరం పలుకరింపుల్లోనూ రామనామం ప్రస్తావిస్తున్నారు. అయోధ్య పౌరులు తమ ఫోన్లలో రాముడి పాటలనే కాలర్ ట్యూన్లు, రింగ్ టోన్లుగా మార్చుకుంటున్నారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ‘యుగ్ రామ్ రాజ్ కా’, ‘రామ్ ఆయే హై అయోధ్య మే’, ‘హరి అనంత్ హరి కథ’ వంటి పాటలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి 5 లక్షల లడ్డూలు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్ భక్తులు 5 లక్షల లడ్డూలు పంపించారు. ఈ లడ్డూలతో ఐదు వాహనా లు శుక్రవారం భోపాల్ నుంచి అయోధ్యకు బయలుదేరాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ వాహనాలకు పచ్చజెండా ఊపారు. 5 లక్షల లడ్డూలు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో తయారు చేశారు. ఉత్తరప్రదేశ్ జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించాలని నిర్ణయించుకున్నారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సైతం ఈ అవకాశం కలి్పంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణప్రతిష్ట వేడుక ప్రత్యక్ష ప్రసారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారక్‌లలో టీవీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పలు రాష్ట్రాల్లో సోమవారం సెలవు రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. రాష్ట్రమంతటా కార్యాలయా లు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలకు సెలవు అమలు చేస్తున్నట్లు తెలియజేసింది. మధ్యప్రదేశ్‌లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తమ విద్యాసంస్థలకు 22న హాఫ్ డే సెలవు ఇస్తున్నట్లు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రకటించింది. అంబానీ నుంచి బచ్చన్ దాకా.. బాలరాముడి ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అత్యంత ప్రముఖులు హాజరుకాబోతున్నారు. బిలియనీర్ ముకేష్ అంబానీ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దాకా చాలామంది ప్రముఖులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పంపించింది. ఆహ్వానితుల జాబితాలో దాదాపు 7,000 మందికి చోటు దక్కింది. ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, అధికారులు, దౌత్యవేత్తలకు ఆహా్వనాలు అందాయి. ముకేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ తమ కుటుంబ సభ్యులతో సహా హాజరుకాబోతున్నారు. సినీ ప్రముఖులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, మోహన్‌లాల్, అలియా భట్, సరోద్ కళాకారుడు అంజాద్ అలీ, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తదితరులను ఆహా్వనించారు. ఆ న్యాయమూర్తులకూ... అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్టకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకాబోతున్నారు. అయోధ్య వివాదంపై తుది తీర్పునిచి్చ, భవ్య మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సభ్యులకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహా్వనం పంపించారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంపై 2019 నవంబర్ 9న చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రాణప్రతిష్టకు హాజరు కావాలని కోరుతూ రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యులతోపాటు 50 మందికిపైగా ప్రఖ్యాత న్యాయమూర్తులు, న్యాయవాదులను సైతం ఆహా్వనించారు. శిల్పికి ‘తీపి బహుమతి’ రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు తియ్యటి బహుమతి లభించింది. మైసూరులోని మహాలక్ష్మీ స్వీట్స్ దుకాణం యజమాన్యం ఆయనకు అయోధ్య రామమందిరం ప్రతిరూపంగా తయారు చేసిన మిఠాయిని బహూకరించింది. రకరకాల స్వీట్లతో ఈ బహుమతిని తయారు చేశారు. 22న ఒడిశా రామాలయ ప్రాణప్రతిష్ట అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిరంలో ఈ నెల 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరుగనుంది. అదే రోజు మరో రామాలయ ప్రాణప్రతిష్ట సైతం జరగబోతోంది. ఒడిశాలో నయాగఢ్ జిల్లా ఫతేగఢ్ గ్రామంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన గుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎగువన ఓ కొండపై 2017లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం ఎత్తు 165 అడుగులు. 150 మందికిపైగా కారి్మకులు ఏడేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు. కళింగ శైలిలో ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడు ఈ కొండపై తపస్సు చేశాడని చెబుతుంటారు. శుక్రవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో అయోధ్య రామాలయం. (ఇన్సెట్లో) శుక్రవారం వీహెచ్‌పీ విడుదల చేసిన రామ్‌లల్లా విగ్రహం ఫొటో -
సౌర వెలుగుల దిశగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు. ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
సొల్యూషన్ లేని ‘అలియాస్’ సమస్య
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో అలియా స్(పేరు మార్పిడి) సమస్య చిక్కుముడిగా మారింది. ఈ సమస్య కారణంగా సంస్థ వ్యాప్తంగా సుమా రు వెయ్యి మందికి పైగా కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు రావడం లేదు. ఏళ్ల తరబడి కా ర్యాలయం చుట్టూ తిరిగినా పని జరగక, స్పౌస్‌లకు పెన్షన్ రాక అవస్థ పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క కార్మికుల సమస్యలు తెలిసినప్పటికీ గుర్తింపు సంఘం నాయకులు ఆ వైపుగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమిటీ సమస్య? సింగరేణి సంస్థలో కార్మికులు అవసరమైన సందర్భాల్లో నియమ నిబంధనలు పక్కనపెట్టి... వచ్చిన వారిని వచ్చినట్లుగా నియమించారు. నిబంధనలన్నీ కచ్చితంగా అమలు చేస్తే ఎవరూ రారనే భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోగా, ఉద్యోగం వస్తుందనే ఆశ, కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందనే భావనతో చాలామంది మారు పేర్లతో చేరారు. ఈ ప్రక్రియలో అటు అధికారులు.. ఇటు కార్మికుల తప్పిదం కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఉద్యోగం చేరాక రెండేళ్లకు కార్మికులను పర్మనెంట్ చేయడం పరిపాటి. కనీసం అప్పుడైనా కార్మికుల పూర్తి వివరాలు సేకరించి సరైన పేర్లతో పర్మనెంట్ చేయాల్సి ఉన్నా.... ఆనా టి సింగరేణి రిక్రూట్మెంట్ సెల్, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ విభాగాల అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సీఎం చెప్పినా అంతే 2018 ఎన్నికల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ సమస్యపై మాట్లాడారు. కార్మికులకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్చి, వారసత్వ ఉద్యోగాల ద్వారా కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే ప్రక్రియను వేగవంతం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇది జరిగి ఐదేళ్లు కావొస్తున్నా ప్రక్రియ పూర్తికాకపోవడంతో సుమారు వేయి మంది కార్మికులు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అధికారులు శ్రద్ధ కనబర్చకపోవడంతో ఉద్యోగుల పేర్లు మార్చకపోగా, ఇంటి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతరత్రా సమాచారం తప్పుగా నమోదవుతోంది. దీంతో పెన్షన్లు మంజూరు కాక, అర్హులైన కార్మికుల్లో కుటుంబీకులకు వారసత్వ ఉద్యోగాలు లభించక నానా అవస్థలు పడుతున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకుంటాం: బలరామ్ సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరామ్‌ను ఈ విషయమై వివరణ కోరగా... బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్మికుల పూర్తి వివరాల సేకరణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. -
సెప్టెంబర్‌లో సింగరేణి లాభాలు ప్రకటిస్తాం: డైరెక్టర్ ఎన్.బలరాం
శ్రీరాంపూర్: ఆర్థిక సంవత్సరం 2021–22లో సింగరేణి సాధించిన లాభాలను సెప్టెంబర్‌లో ప్రకటిస్తామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడు లాభాలు పెరిగాయని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సింగరేణి ఎస్సీఓఏ క్లబ్ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన ఏసీ హాల్‌ను ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ సంస్థ లాభాలపై సెంట్రల్ ఆడిట్ కావాల్సి ఉందని, సెప్టెంబర్‌లో లాభాల లెక్క తేలుస్తామన్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మల్లన్నసాగర్లో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలోని నైనీబొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పలేదని, ఓబీ పనులు, కోల్ ఆపరేషన్స్ అవుట్ సోర్సింగ్‌తో చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల, అధికారుల పిల్లలకోసం 15 శాతం సీట్లు కేటాయించాలని ఆరోగ్యశాఖను కోరామన్నారు. సింగరేణికి వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ డైరెక్టర్ రవిప్రసాద్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదిర్, ఏరియా ఇన్చార్జి ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్, క్లబ్ సెక్రెటరీ సంతోష్‌కుమార్, డీజీఎంలు శివరావు, గోవిందరాజు, ఓసీపీ పీవో రాజేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ సత్యనారాయణ, ఎస్టేట్స్ అధికారి స్వప్న పాల్గొన్నారు. -
‘బ్లాకుల’ ప్రైవేటీకరణ అసాధ్యం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అసాధ్యం. సింగరేణి సంస్థకు చెందిన గనులన్నీ ఆ సంస్థకే చెందాలని నిజాం పాలనలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో సింగరేణి సంస్థ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పం దం కుదుర్చుకున్నాయి. సింగరేణిలో రాష్ట్ర ప్రభు త్వం 51, కేంద్రం 49% వాటాలు కలిగి ఉన్నాయి. దీంతో ఏ విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వానిదే తుదినిర్ణయంగా ఉంటుంది’అని సింగరేణి పర్సనల్, అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్(పీఏడబ్ల్యూ) డైరెక్టర్ ఎన్.బలరాం స్పష్టం చేశారు. సింగరేణికి పేలుడు పదర్థాల సరఫరాపై ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం, గనుల్లో వరుస ప్రమాదాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, డిస్మిస్ కార్మికుల సమస్యల గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. టెండర్లు పిలిచినా ముందుకు రాలేదు 2015 జనవరిలో అమల్లోకి వచ్చిన మినరల్స్, మైన్స్డెవలప్మెంట్ రెగ్యులరైజేషన్(ఎంఎండీఆర్) చట్టానికనుగుణంగా తెలంగాణ లోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ–3, శ్రావణపల్లి ఓసీ, కేకే–6 బ్లాకు లను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కంపెనీలకు బ్లాకులు అప్పగిస్తే సమయం ఆదాతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుంటాయని కేంద్రం భావించింది. త్రైపాక్షిక ఒప్పందానికి కేంద్ర నిర్ణయం విరుద్ధంగా ఉండటం, దాన్ని కార్మికసంఘాలు వ్యతిరేకించడంతో బ్లాకుల ప్రైవేటీకరణ సాధ్యం కాని పని. బ్లాకుల నిర్వహణకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పట్లో ప్రైవేటీకరణ లేనట్టే. ఎక్స్‌ప్లోజివ్స్ కోసం ప్రత్యామ్నాయ చర్యలు ఉక్రెయిన్– రష్యా యుద్ధం నేపథ్యంలో సింగరేణికి ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరా(అమ్మోనియం నైట్రేడ్) పూర్తిగా నిలిచిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ (పుణే–70%ఎక్స్‌ప్లోజివ్స్), స్టార్ క్యామ్ సంస్థ(30%) ద్వారా ఒక టన్ను ఎక్స్‌ప్లోజివ్స్‌కు రూ.65 వేలకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసుకుంటోంది. వచ్చే నెల రెండోవారం వర కు ఆయా సంస్థలతో ఒప్పందం ఉంది. యుద్ధం కొనసాగినా ఆ పరిస్థితిని అధిగమించేలా సింగరేణి ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించింది. రోజూ ఓపెన్ కాస్టుల్లో ఓవర్ బర్డెన్కు 560 టన్నులు, భూ గర్భ గనులకు 50 టన్నులు మొత్తం 610 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్ అవసరమవుతాయి. స్థానికతకు పెద్దపీట రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సింగరేణి నియామకా ల్లో స్థానికతకు పెద్దపీట వేస్తున్నాం. ఇకపై సంస్థలో కార్మిక విభాగంలో 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తాం. ఎగ్జిక్యూటివ్ నియామకాల్లో గతంలో ఉన్న 60(స్థానిక), 40(స్థానికేతర) శాతాన్ని మార్పు చేశాం. 80% ఉద్యోగాలు స్థానికులకు, 20% స్థానికేతరులకు ఇవ్వనున్నాం. ఇటీవల సింగరేణి భూగర్భ గనుల్లో ప్రమాదాలు పెరగడం బాధాకరం. డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ పర్యవేక్షించి ఆదేశిస్తేనే కార్మికులు గనుల్లో పని చేస్తుంటారు. గతం తో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయి. మరో అవకాశం సింగరేణిలో ఆరు వేలమంది డిస్మిస్ కార్మికులున్నా రు. అనారోగ్యం, గనుల్లో పని చేయడం ఇష్టం లేక, వ్యవసాయం, ఇతర ఉద్యోగాలపై ఆసక్తితో కార్మికులు సింగరేణి వంద మస్టర్ల నిబంధనను పాటించడం లేదు. దీంతో వారిని డిస్మిస్ చేయాల్సి వస్తుంది. వీరి కోసం బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిర్ణయం ప్రకారం మరో అవకాశం ఇవ్వాలని సింగరేణి భావిస్తోంది. -
తెలంగాణలో బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 5 రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేదని సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ స్పష్టంచేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఇక్కడి సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డెరైక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గనిర్దేశం చేశారు. ఒప్పందం ఉన్న ప్లాంట్లకు సరఫరా.. సింగరేణితో ఒప్పందం చేసుకున్న తెలంగాణ జెన్కో థర్మల్ ప్లాంట్లతో పాటు ముద్దనూరు(ఏపీ జెన్కో), పర్లీ(మహారాష్ట్ర జెన్కో) రాయచూర్ కేపీసీఎల్ (కర్ణాటక), మెట్టూర్ టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. -
ఆమంచి రాజీనామాతో బెంబేలెత్తిన టీడీపీ అధిష్టానం
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి పోవడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో టీడీపీ అధిష్టానం బెంబేలెత్తి పోయింది. చీరాలలో పరువు నిలుపుకొనేందుకు అప్రమత్తమైంది. చీరాల టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు ఎమ్మెల్సీ కరణం కుటుంబానికి అప్పగించేందుకు సిద్ధ్దమైంది. కరణం బలరామకృష్ణమూర్తి లేదా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌లలో ఎవరో ఒకరిని వచ్చే ఎన్నికలలో చీరాల టీడీపీ అభ్యర్థిగా నిలపాలని నిర్ణయించింది. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని చంద్రబాబు బలరాంను ఆదేశించినట్లు తెలుస్తోంది. చీరాల నుంచి బలరాం పోటీలో ఉంటేనే బాగుంటుందని జిల్లా టీడీపీ నేతలు సీఎంకు సూచించినట్లు సమాచారం. గురువారం చీరాలలో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. దీంతో గురువారం చీరాలలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం, మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో చీరాల అభ్యర్థి ఎంపికపై చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. సీటు మాకంటే మాకు.. మరోవైపు చీరాల టికెట్ తనకే ఇవ్వాలని మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ పెద్దలను కలిసిటికెట్ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. బలరాం కుటుంబానికి పాలేటి సహకరించే పరిస్థితి కూడా లేదు. అటు ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం రాబోయే ఎన్నికలలో తానే పోటీలో ఉంటానని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చీరాల నుంచి ఇద్దరు నేతలు టికెట్ కోసం అధిష్టానం పై ఒత్తిడి తెస్తుండగా చంద్రబాబుతో పాటు జిల్లా ముఖ్య నేతలు కరణం కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చీరాలలో గట్టి పట్టు ఉన్న ఆమంచిని ఎదిరించాలంటే కరణం కుటుంబమే పోటీలో ఉండాలని వారు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కరణం తొలుత నిరాకరించినట్లు సమాచారం. ఇన్నాళ్లు చంద్రబాబు తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇప్పుడు అవసరానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని కరణం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాడు తనకు వ్యతిరేకంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారని ఆయన వాదనకు దిగినట్లు సమాచారం. ఇప్పుడు తన అవసరం వచ్చింది కాబట్టి మళ్లీ వాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారని, తాను చీరాల నుంచి పోటీ చేయనని కరణం అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు అధిష్టానం దూతలు బుధవారం మధ్యాహ్నం అమరావతి సచివాయంలో కరణంతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత ఉంటుందని, అన్నీ మీ చేతుల మీదుగానే జరుగుతాయని, మొత్తం సీఎం చూసుకుంటారని వారు బలరాంకు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ చీరాల బరిలో నిలిచేందుకు అయిష్టత చూపిన బలరాం తాను పోటీలో ఉండలేనని, అక్కడ బీసీ అభ్యర్థిని నిలపాలని సూచించినట్టు తెలిసింది. చంద్రబాబు మాత్రం పోటీలో ఉండాల్సిందేనంటూ బలరాంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. మరి దీనికి ఆయన ఎలా స్పందిస్తారు.. పోటీలో తానే ఉంటారా లేక తనయుడు వెంకటేశ్‌ను నిలుపుతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బలరాం చీరాల అభ్యర్థిగా నిలిచే పక్షంలో వెంకటేశ్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారన్న ప్రచారం ఒక వైపు సాగుతుండగా మరోవైపు ఎమ్మెల్సీ హోదాలోనే బలరాం పోటీలో ఉంటారన్న ప్రచారమూ ఉంది. కుమారుడు వెంకటేశ్ భవితవ్యం పైనా బలరాం హామీ తీసుకున్నట్లు తెలుస్తున్నా అది ఏమిటన్నది తెలియాల్సి ఉంది. గురువారం సాయంత్రానికి చీరాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎమ్మెల్యే ఆమంచి వైఎస్సార్సీపీ అ«ధినేత వైఎస్ జగన్‌ను కలవడం అనంతరం టీడీపీలో పరిణామాలు బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారాయి. టీడీపీలో డీలా... టీడీపీ ముఖ్యనేతలు వరుసబెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో జిల్లాలో ఆ పార్టీ డీలా పడింది. టీడీపీకి చెందిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరగా చీరాల సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ను కలిసి, త్వరలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతకు ముందే కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీ లో చేరగా పర్చూరు కు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు నేతలు సైతం త్వరలో వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. దీంతో జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన అభ్యర్థులు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాలు వైఎస్సార్సీపీలో రెట్టించిన ఉత్సాహం నింపగా టీడీపీని డీలా పడేలా చేసింది. -
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్‌పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్‌పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
షేల్ గ్యాస్ వెలికితీతను అడ్డుకోండి
సీపీఎం జిల్లా కార్యదర్శిబలరాం ఏలూరు(సెంట్రల్): అభివృద్ధి పేరిట మరో విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉంటూ ఐక్యంగా షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పచ్చని పొలాలతో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాను కాలుష్యకాసారంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. కృష్ణగోదావరి బేసిన్లో షేల్ గ్యాస్ వెలికితీతకు తొలుత ఒఎన్‌జిసీ పేరుతో ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించి బావులు తవ్వేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించి బాధిత గ్రామాలను వదిలి భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని బలరాం ప్రశ్నించారు. అనేక అనర్థాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బాధిత గ్రామాల ప్రజలకు అండగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ప్రజల సహయంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఆయణ హెచ్చరించారు. -
నకిలీ మావోయిస్టుల అరెస్టు
మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన యు.బలరాం, కృష్ణ, నర్సింహ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బొమ్మ పిస్టళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. -
ఆభరణాలు చోరీ చేసిన వర్కర్ అరెస్ట్
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మీనాక్షి జ్యువెల్లర్స్లో యజమాని కళ్లుగప్పి అక్కడ పని చేస్తున్న వ్యక్తి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు తస్కరించి పరారీలో ఉన్న నిందితుడిని క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ చోరీ ఘటనను క్రైం పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే రోడ నెం. 12లో మీనాక్షి జ్యువెల్లరీస్ డిజైనర్ ఆభరణాల షోరూం ఉంది. 2014 డిసెంబర్ 6వ తేదీన ఈ ఆభరణాల షోరూంలో డిజైనర్ ఆభరణాలను తయారు చేసే వెస్ట్‌బెంగాల్‌కు చెందిన బలరాం సామంత (30) యజమాని ఇచ్చిన ఆభరణాలతో ఉడాయించాడు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుంది. జ్యువెల్లర్స్ షోరూం యజమాని నితిన్ అగర్వాల్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుడు దొరకని కారణంగా ఈ కేసును మూసేశారు. నిందితుడి వివరాలు కొంత వరకు తెలియడంతో ఫిర్యాదుదారు ఈ కేసును మళ్లీ తెరిపించాడు. పశ్చిమబెంగాల్లో తిష్టవేసిన బలరాం సామంతను ఇటీవలనే అదుపులోకి తీసుకొని హుగ్లి కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్‌వారెంట్ మీద నగరానికి తీసుకొచ్చి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు చోరీ చేసిన ఆభరణాలను అక్కడే విక్రయించగా కొనుగోలుదారిడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడిని మరోమారు కస్టడీలోకి తీసుకుంటే ఆభరణాలు రికవరీ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఆ అధికారం స్పీకర్‌కు ఉండదు'
-
'ఆ అధికారం స్పీకర్‌కు ఉండదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం హైకోర్టు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉండదన్నారు. ఒక సెషన్ కంటే ఎక్కువ సస్పెండ్ చేయాలంటే మొదట ఫిర్యాదు చేయాలని, ఆ తరువాత ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదును పంపాలని చెప్పారు. టీడీపీ నేత కరణం బలరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా అంశాలు రెండు వేర్వేరు అని ఆయన అభిప్రాయపడ్డారు. కరణం బలరాం వ్యవహారంలో ప్రివిలేజ్ కమిటీ విచారించాకే 6 నెలలపాటు సస్పెండ్ చేసినట్టు రవిశంకర్ గుర్తు చేశారు. టీడీపీ నిర్ణయం.. సభ మొత్తం నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూజువాణి ఓటుతో ఎమ్మెల్యే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
పొరపాట్లు దిద్దుకుంటాం
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో లోపాలను పొరపాట్లును సరిదిద్దుకుంటామని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. సోమవారం ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదం నేపధ్యంలో ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. ఏడీఈ నాగేంద్ర మృతి బాధకరమని, సెఫ్టీ నియమాలను జెన్కోలోని అన్ని స్టేషన్లో కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆర్టీపీపీ అధికారులు, గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆరో యూనిట్‌లోని బాయిల్, చిమ్నీ, ఈఎస్పీ, టర్బెన్ పనులను పరిశీలించారు. అనంతరం సీఈ చాంబర్లో విలేఖర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కో పరిధిలో ఇంత ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది పరిశీలించి పొరపాట్లు సరిచేసుకుంటామని చెప్పారు. ఈ సంఘనపై ప్రత్యేకంగా కమిటీ వేస్తామని చెప్పారు. ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు... ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంపై జెన్కో డెరైక్టర్ బలరాం ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని నియామించినట్లు చెప్పారు. ఈ కమిటీలో జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ రెండు వారాల లోగా అన్ని కోణాలలో విచారణ చేసి పూర్తి సమాచరంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సెఫ్టీ పాటించకపోతే లోనికి రాన్వికండి... ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగాలు, అధికారులు, కార్మికులు ఏవరైనా సరై సెఫ్టీ నియమాలు పాటించకపోతే లోనికి రాన్వివద్దని జెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. ఆర్టీపీపీలోని ఆరో యూనిట్లో అన్ని చోట్ల సెఫ్టీకి సంబంధించి బోర్టులు ఉంచాలని సూచించారు. ప్రధానంగా గేటు వద్ద పర్యవేక్షణ చేసి సెఫ్టీ లేకపోతే బయటకు పంపాలని ఆదేశించారు. ప్రాజె క్ట్ పనులలో ప్రత్యేకంగా సెఫ్టీపై పర్యవేక్షణ అధికారులను నియమిస్తామన్నారు. ఎస్ఈలు ఈ సెఫ్టీపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌లలో అదనంగా అంబులెన్సుల సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పారు. నష్టపరిహారంతో గాయపడిన కార్మికులకు సాయంగా నిలుస్తాం ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు కంపెనీ ఇస్తున్న నష్టపరిహారంతో పాటు జెన్కో బోర్డు కూడా అందిస్తుందన్నారు. గాయపడిన కార్మికులకు వైద్య ఖర్చులను బోర్టు భరిస్తుందన్నారు. ముఖ్య మంత్రి సంతాపం.. ఆర్టీపీపీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడీఈ నాగేంద్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారని ఏపీజెన్కో ఎండీ విజయానంద్ అన్నారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ఆర్టీపీపీ బొగ్గు కొరతను అధిగమిస్తాం. ఆర్టీపీపీలోని బొగ్గు కొరతను త్వరలోనే అధిగమిస్తామని ఆయన అన్నారు. 15 రోజులకు అవసరమైన బొగ్గు ఉండాలని, అరుుతే కొరత కారణంగా ప్రస్తుతం ఏరోజుకారోజు అన్నట్లు నడుస్తోందన్నారు. క్రిష్ణపట్నంకు బొగ్గు తరలిపోతోందని, అలాగే విజయవాడ బొగ్గును ఆర్టీపీపీకి ఇస్తున్నామని చెప్పారు. సింగరాణి నుంచి 1 మిలియన్ బొగ్గు ఇక్కడికి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే ఆర్టీపీపీలో 20 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని ఎక్కడ కూడా కోతలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీజెన్కో డెరైక్టరు బలరాం, జెన్కో సివిల్ సీఈ రత్నబాబు, టీపీసీ సీఈ కృపసాగర్, ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు, ఎస్ఈలు శేషారెడ్డి, శ్రీధర్‌బాబు, రామముత్యలరావు, రామసుబ్బారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నర్సంహరావు, దేవేంద్రనాయక్లు, సంక్షేమ శాఖ అధికారి తిరుమల రావు, ఎస్పీఎఫ్ కమాడెంట్ మునిరాజ, ఆర్ఐ ఉస్సేనయ్య, కలమల్ల ఎస్ఐ హేమాద్రి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతల్లో టికెట్ టెన్షన్
దిగ్విజయ్‌తో బలరామ్, కవిత భేటీ ఏఐసీసీ నేతల చుట్టూ ప్రదక్షిణలు ఢిల్లీలో జిల్లా కాంగ్రెస్ నేతల మకాం వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ సిట్టింగ్లతో సహా ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పెరుగుతోంది. నిన్నటి వరకు తమకు టికెట్ గ్యారంటీ అని భావించిన నేతల్లో సైతం అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సిట్టింగ్‌లు, ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియాలను కలుసుకొని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. శుక్రవారం తొలి జాబితా వస్తుందని భావించిన నేపథ్యంలో వాయిదా పడడంతో మరింత ఆందోళనకు లోనవుతున్నారు. పొత్తు ప్రచారంతో ఆందోళన టీఆర్ఎస్తో పొత్తులేదని ఇరుపార్టీల నేతలు ప్రకటిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయిలో పొత్తుంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా తొలి జాబితా విడుదల జాప్యమైనట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తుంటే తమ స్థానం గల్లంతేనని భావించేవారు, సీపీఐతో పొత్తుంటే తమ పరిస్థితేమిటని ఆందోళన చెందేవారు, కొత్తగా టికెట్ కోరుకునే నేతలంతా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ఇప్పటికే నేతలను కలిసి వచ్చారు. పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితలు కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ఈ ఎన్నికల్లో తమకే టికెట్ కేటాయించాలని విన్నవించారు. అయితే బలరాంనాయక్, కవితల పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే ప్రచారం ఊ పందుకున్నది. ఈ దఫా సిట్టింగ్లైనప్పటికీ టికెట్ దక్కుతుందో?లేదో?ననే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో వర్గపోరుతో ఈ సమ స్య మరింత పెరిగింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కే టికెట్ అని ప్రచారం కావడంతో ఎమ్మెల్యే కవితలో ఆందోళన నెలకొంది. తాజాగా శుక్రవారం మహబూబాబాద్‌కు వచ్చిన సీపీఐ నేత నారాయణ సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ వారికి ప్రజాదరణ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐతో పొత్తుంటే ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆశావహులంతా అక్కడే.. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, టికెట్ వస్తుందోరాదోననే భయం ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమకు మరోసారి పోటీకి అవకాశం కల్పించాలని కోరారు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, తాజాగా పాలకుర్తి నుంచి తమకు అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనాయణ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆశావహులు డాక్టర్ విజయరామారావు, రాజారపు ప్రతాప్, భువనగిరి ఆరోగ్యం, పరకాల టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. -
ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతులు, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా ట్రిబ్యునల్ ముందు కృష్ణా డెల్టా ప్రయోజనాలు కాపాడేలా వాదనలు వినిపించలేకపోయారని విమర్శించారు. నీటిలభ్యత, మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీసుకున్న ప్రాతిపదకలు శాస్త్రీయంగా లేవని, ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో ప్రతిపాదించ కూడదని డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్‌కు అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కౌలురైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణా డెల్టా ఆయకట్టుకు తీవ్ర హాని చేసే విధంగా ఉందన్నారు. కాలువ పనుల ఆధునికీకరణను సకాలంలో పూర్తి చేసి కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వాస్తవ సాగుదారులకు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు రైతు సంఘం నాయకులు లింగం కృష్ణారావు, గుండపనేని సురేష్, సత్తిబాబు, కౌలు రైతుల సంఘ నాయకులు గండి రాజా తదితరులు నాయకత్వం వహించారు. -
గడువు దాటొద్దు...
=నాణ్యత ప్రమాణాలు పాటించాలి =అధికారులు సమన్వయంతో పనులు పర్యవేక్షించాలి =భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి =మంత్రులు బలరాం, వెంకటరెడ్డి =మహాజాతర ఏర్పాట్లపై మేడారంలో అమాత్యుల సమీక్ష =వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేడారం (గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయూలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా నిరంతరంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కిషన్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా అధికారులు తమ తమ పరిధిలో జరుగుతున్న పనుల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా నాయక్, వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోటి మంది భక్తులు వస్తారన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన మేడారంలో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అప్పటివరకు పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకోవాలని ఏ జీఓలో ఉంది... అంటూ మంత్రులు బలరాం నాయక్, వెంకటరెడ్డి అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తు.. సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని మండిపడ్డారు. కాల్వపల్లి- నార్లాపూర్ రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతోపాటు వాటి తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రుల దృష్టికి రాగా... వారు ఇలా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తీసుకువచ్చే ట్రాక్టర్లను కూడా ఆపొద్దని పోలీస్ అధికారులకు సూచించారు. అనంతరం గుడుంబా నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి వచ్చే నల్లబెల్లాన్ని నియంత్రించకుండా స్థానికులపై దాడులు చేయడమేంటని వారిని మంత్రులు ప్రశ్నించారు. తన పార్లమెంట్ పరిధిలో 30 వేల మంది సారా తాగి చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని బలరాం నాయక్ తెలిపారు. అక్రమంగా బెల్లం, ఇతర వస్తువులను తీసుకువస్తున్న వాహనాలు, అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలని... దీని ద్వారా గుడుంబా తయారీ, అమ్మకాలు వాటంతట అవే తగ్గిపోతాయన్నారు. రెడ్డిగూడెంలో మద్యం నిల్వకు ప్రత్యేక గోడౌన్ ప్రతి సారి ట్రాఫిక్ రద్దీతో డిమాండ్‌కు అనుగుణంగా మద్యం బాటిళ్లను తీసుకురాలేక పోతున్నారని, ఈ మేరకు తగు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులకు ఎక్సైజ్ అధికారులు వివరించారు. అధిక మొత్తంలో మద్యాన్ని దుకాణదారులకు అందించేలా రెడ్డిగూడెంలో ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుంకం చెల్లించని, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు 10 చెక్‌పోస్టులు, ఏడు పెట్రోలింగ్ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ వద్ద కనీస పనులకు నిధులివ్వండి బస్టాండ్ ప్రాంగణంలో ప్రతి సారి వెట్‌మిక్స్ వేయడం ద్వారా మట్టి లేవకుండా ఉండేదని... ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్టాండు వద్ద లెవలింగ్, రోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్టాండ్ చుట్టూ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వారు... మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బస్టాండ్ ప్రాంగణంలో కనీస పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆల్కహాల్ బ్రీతింగ్ అనలైజర్లను అన్ని పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేసి.... డ్రైవర్లను పరీక్షించాలన్నారు. దీనివల్ల భక్తులకు బస్సు ప్రయాణంపై నమ్మకం కలుగుతుందన్నారు. సమావేశంలో ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. అధిక నిధులిచ్చిన ఘనత మాదే : రాంరెడ్డి ఆదివాసీల జాతరకు అత్యధిక నిధులిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డి, రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిలు ప్రారంభించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలకనుగుణంగా ప్రభుత్వం నిధుల మం జూరు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారన్నారు. ప్రతిసారి పనుల హడావుడితో పనుల్లో నాణ్యత లోపాలు తలెత్తాయని.. ఇప్పటికైనా అలాంటి సంప్రదాయూనికి చెక్ పెట్టేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట వేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని, వీరిలో పట్టాలు లేని రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఎమ్మెల్యే సీతక్క కోరగా... మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఏదో ఒక రూపంలో పరిహారం అందే లా చూస్తామన్నారు. స్థానికంగా ఆదివాసి మ్యూజియం ఏర్పాటుకు రూ.3 కోట్లు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్‌కు రూ.కోటి విడుదల చేస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు మూడు రోజుల జాతర వద్దే ఉండాలని మంత్రి రాంరెడ్డి సూచించారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన నాయకులు కొందరు సమ్మక్క-సారలమ్మ తల్లుల ముందు ఓ మాట, మనసులో మరో మాట అనుకుంటారని... అయితే వారి మనసులోని మాట తల్లులకు తెలుసన్నారు. వారి మనసులో ఉండే కుతంత్రాలను మార్చాలని తాము తల్లులను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఏజేసీ, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ సంజీవయ్య, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఎంజీఎం దుస్థితి...పధాని దృష్టికి
వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం. జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మేడారం చుట్టూ కొత్త రోడ్లు గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం. దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు. గ్రామాల రోడ్లు..రెండింతలు ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం. జంపన్నవాగుపై మరో బ్రిడ్జి జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది. దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం. -
విద్యుదాఘాతానికి దంపతులు మృతి
మారేడుపల్లి/రసూల్‌పురా,న్యూస్‌లైన్: వెలుగు నింపాల్సిన విద్యుత్ తీగలు ఓ ఇంట్లో చీకట్లను నింపాయి. దంపతులను బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన కంటోన్మెంట్ పికెట్ లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం జరిగింది. పికెట్ లక్ష్మీనగర్‌లో బలరామ్(60), లక్ష్మీనర్సమ్మ(50) తమ చిన్నకూతురు జయశ్రీ(22)తో కలిసి వుంటున్నారు. లక్ష్మీనర్సమ్మ గతంలో స్థానిక అభయాంజనేయస్వామి ఆలయానికి ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించింది. అనంతరం అదే గుడిలో దేవునికి సేవలు చేస్తూ, ఆలయ శుభ్రత పనులు చేస్తోంది. ఈమె భర్త బలరామ్ మేస్త్రి. బుధవారం ఉదయం 7 గంటలకు లక్ష్మీనర్సమ్మ ఇంటి బయట పళ్లు తోముకుంటుండగా.. పైన ఉన్న విద్యుత్ తీగ తెగి ఆమె మెడమీద పడింది. ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. ఆ తీగను చేత్తో పట్టుకుని కింద పడేసేందుకు ప్రయత్నించింది. ఇం ట్లో ఉన్న భర్త బలరామ్ బయటికి వచ్చి ఆమెను కాపాడేందుకు యత్నించగా.. అతను కూడా విద్యుదాఘాతానికి గురై కేకలు పెట్టాడు. ఇంట్లో ఉన్న చిన్నకూతురు జయశ్రీ తండ్రి అరుపులు విని బయటకు వచ్చింది. తల్లిదండ్రులను రక్షించబోగా ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. అప్పుడే అటుగా వెళ్తున్న నాగేష్ అనే వ్యక్తి పక్కనే ఉన్న కర్రతో కొట్టి జయశ్రీని విడిపించాడు. బలరామ్, లక్ష్మీనర్సమ్మలు అక్కడిక్కడే మృతి చెందగా.. జయశ్రీ చేయి కాలిపోయింది. ఈమె గాంధీలో చికిత్సపొందుతోంది. లక్ష్మీనర్సమ్మ మృతికి సంతాపంగా ఆభయాంజనేయస్వామి ఆలయాన్ని మూసేశారు. సబ్‌స్టేషన్ ముట్టడి... కార్ఖానా ఏఈ శిరీషా, లైన్మెన్ శివప్రసాద్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. మృతుల బంధువులు, బస్తీవాసులు జింఖానాలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించి ఏఈ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. కార్ఖానా,మారేడుపల్లి సీఐల ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారికి నచ్చజెప్పారు, ట్రాన్స్‌కో డీఈ రాంకుమార్, ఏడీఈలు సబ్‌స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే శంకర్రావు, వైఎస్సార్సీపీ నాయకులు జంపన ప్రతాప్, వెంకట్రావు, బోర్డు ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సా యన్న, పీసీసీ కార్యదర్శి అయూబ్‌ఖాన్, దేవేందర్, గజ్జేల నాగేష్ తదితర నాయకులు ఘటన స్థలానికి వచ్చి బస్తీవాసులకు అండగా నిలిచారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ జేశారు కేంద్ర మంత్రి సర్వే, ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం... కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఘటనా స్థలాన్ని వచ్చి, విద్యుత్ ఎస్ఈతో ఫోన్లో సంప్రదించగా నిబంధనల మేరకు మృతుల కుటుంబానికి మొత్తం రూ. 2 లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. మంత్రి సర్వే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడంతో వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయవడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వచ్చిన ఎమ్మెల్యే శంకర్రావు అధికారులతో మా ట్లాడుతుండగా.. ‘ ఏం మాట్లాడుతున్నారని స్థానికులు ఆయనను నిలదీశారు. ఎమ్మెల్యే వారిని మీకేమీ తెలియదు అనడంతో బస్తీవాసులు ఆయనపై ఆగ్ర హంతో ఊగిపోయారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయం పరిశీలిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనవిరమించారు.