ఎస్సీఓఏ క్లబ్‌లో ఏసీ హాల్‌ను ప్రారంభిస్తున్న డైరెక్టర్ బలరాం
శ్రీరాంపూర్: ఆర్థిక సంవత్సరం 2021–22లో సింగరేణి సాధించిన లాభాలను సెప్టెంబర్‌లో ప్రకటిస్తామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడు లాభాలు పెరిగాయని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సింగరేణి ఎస్సీఓఏ క్లబ్ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన ఏసీ హాల్‌ను ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ సంస్థ లాభాలపై సెంట్రల్ ఆడిట్ కావాల్సి ఉందని, సెప్టెంబర్‌లో లాభాల లెక్క తేలుస్తామన్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మల్లన్నసాగర్‌లో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలోని నైనీబొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పలేదని, ఓబీ పనులు, కోల్ ఆపరేషన్స్ అవుట్ సోర్సింగ్‌తో చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల, అధికారుల పిల్లలకోసం 15 శాతం సీట్లు కేటాయించాలని ఆరోగ్యశాఖను కోరామన్నారు.
సింగరేణికి వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ డైరెక్టర్ రవిప్రసాద్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదిర్, ఏరియా ఇన్‌చార్జి ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్, క్లబ్ సెక్రెటరీ సంతోష్‌కుమార్, డీజీఎంలు శివరావు, గోవిందరాజు, ఓసీపీ పీవో రాజేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ సత్యనారాయణ, ఎస్టేట్స్ అధికారి స్వప్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment