సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు.
ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment