రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా ఆగి పోయింది. విద్యుదుత్పత్తికి బ్రహ్మంసాగర్ నుంచి నీరు సరఫరా చేసే పైపులైన్ ఊహించని రీతిలో దెబ్బతింది. వివరాలివీ.. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి 68 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. చాపాడు మండలంలోని కుందూ, ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నదులపై ఈ పైపులైన్ వస్తోంది.
దీని ద్వారా ఆర్టీపీపీకి రోజు 38 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఆర్టీపీపీలో 1050 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. గురువారం సాయంత్రం పెన్నానదిలోని పైపులైన్‌కు సంబంధించి ఎక్స్‌పాన్షన్ జాయింట్ ఊడిపోయింది. తీవ్ర ఒత్తిడి ప్రభావం కారణంగా ఈ జాయింట్ ఊడిపోయి నీరు పెన్నానదిలోకి చేరింది. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేస్తే తప్ప పైపులైన్ నిర్మాణం యధాస్థితికి రాదని తెలుస్తోంది.
ఆర్టీపీపీకి ఆగిన నీటి సరఫరా
Published Fri, Mar 18 2016 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement