వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ)లో ఆదివారం నాటికి బొగ్గు నిల్వలు 1.25 లక్ష టన్నులకు చేరుకున్నాయి. గతంలో బొగ్గు కొరత ఏర్పడి ఒకానొక దశలో ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం అందుకు భిన్నంగా సుమారు 1.25 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ఆర్టీపీపీ సీఈ కుమార్‌బాబు తెలిపారు. ఆర్టీపీపీలోని 1, 2, 3, 4, 5 యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, 1,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు.