ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామ పరిధిలోని కృష్ణానగర్‌లో వెంకటసుబ్బమ్మ (30) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మైదుకూరు మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన చందా వెంకటస్వామి, వెంకటసుబ్బమ్మలు 2001లో కలమల్లకు వచ్చి కృష్ణానగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. వెంకటసుబ్బమ్మ ఆర్టీపీపీలో మెయింటైన్స్ ఉద్యోగం చేస్తోంది. వెంకటస్వామి కువైట్‌కు వెళ్లి వస్తూ ఉండేవాడు. నెల రోజుల కిందట భర్త కువైట్ నుంచి వచ్చాడు. ఇకపై కువైట్‌కు వెళ్లవద్దని భార్య తరచూ భర్తతో గొడవ పడుతుండేది. బుధవారం కూడా ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు.భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.