venkata subbamma
-
గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ
భారత జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలై, ఉద్యమం ఊపందుకున్న రోజులు అవి. దేశ ప్రజలందరిలో జాతీయత భావం ఒకేరకంగా ఉన్నప్పటికీ భాష వేరు కావడం వల్ల పోరాటం సంఘటిత శక్తిగా మారడంలో విఫలమవుతోందని గ్రహించిన గాంధీజీ ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. గూడూరులో బహిరంగ సభ హిందీ ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో ఎక్కువగా పర్యటించారు గాంధీజీ. అలాగే హరిజనోద్ధరణ కోసం కూడా ఆయన విస్తృతంగా గ్రామాలను సందర్శించారు. 1934లో గాంధీజీ చెన్నై నుంచి రైల్లో గూడూరు మీదుగా నెల్లూరుకు పర్యటిస్తున్నప్పుడు గూడూరులో ధర్మరాజు ఆలయం ముందు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి హిందీ, తెలుగు తెలిసిన వారొకరు కావలసి వచ్చారు. అప్పుడు గాంధీజీ ప్రసంగాన్ని తెనుగీకరించింది ఓ పదమూడేళ్ల అమ్మాయి! ఆమె పేరు తన్నీరు వెంకటసుబ్బమ్మ. అనువాదం ఒక్కటే కాదు, ఆనాటి జాతీయోద్యమంలో వెంకటసుబ్బమ్మగారు అనేక విధాలుగా పాల్పంచుకున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆమె కుమారుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ సాక్షి ‘జైహింద్’తో పంచుకున్నారు. ‘బాలకుటీర్’లో నేర్చుకుంద ‘‘మా అమ్మ పుట్టిల్లు తిరుపతి జిల్లా గూడూరు (అప్పటి నెల్లూరు జిల్లా). మా తాత తన్నీరు రమణయ్య సోడా వ్యాపారి. స్వాతంత్య్రపో రాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన గూడూరు పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు కొంతకాలం బళ్లారిలో జైలు శిక్షను కూడా అనుభవించారు. గాంధీజీ హిందీ ప్రచారోద్యమాన్ని చేపట్టినప్పుడు హిందీ నేర్చుకోవడానికి మా అమ్మను గూడూరులోని ‘బాల విద్యాకుటీర్’లో చేర్పించారు మా తాతయ్య. గూడూరులో శిక్షణ తర్వాత చురుగ్గా ఉన్న ముగ్గురిని ఎంపిక చేసి ప్రయాగ మహిళా విద్యాపీఠంలో విదుషీ పట్టా కోర్సు కోసం అలహాబాద్‌కు పంపించారు వాళ్ల హిందీ టీచర్ గుద్దేటి వెంకట సుబ్రహ్మణ్యంగారు. అలా అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో హిందీ నేర్చుకుంటూ, కస్తూర్బా ఆశ్రమంలో జాతీయ నాయకులకు సహాయంగా పని చేసే అవకాశం వచ్చింది అమ్మకు. సరోజినీ నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ, అనిబీసెంట్, విజయలక్ష్మీ పండిట్ వంటి నాయకుల మధ్య జరిగే చర్చలను దగ్గరగా చూశారామె. ఆమెలో జాతీయోద్యమ స్ఫూర్తికి బీజాలు పడిన సందర్భం అది. బాపూజీ ముగ్ధులయ్యారు కోర్సు పూర్తయిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూడాలనే ఉద్దేశంతో అమ్మను గూడురుకు తీసుకువచ్చేశారు మా తాతయ్య. గాంధీజీ హరిజనోద్ధరణ మూవ్మెంట్లో భాగంగా దక్షిణాది యాత్ర చేసినప్పుడు అమ్మ దుబాసీగా గాంధీజీ ప్రసంగాన్ని తర్జుమా చేయడంతోపాటు బాపూజీకి స్వాగతం పలుకుతూ సన్మాన పత్రం చదివింది. స్పష్టమైన ఉచ్చారణకు, ధీర గంభీరంగా చదివిన తీరుకు ముగ్ధుడైన బాపూజీ అమ్మ చేతిని ముద్దాడి, తన మెడలో ఉన్న ఖాదీ మాలను తీసి అమ్మ మెడలో వేశారు. తాను రాసుకుంటున్న పెన్నును కూడా బహూకరించారు. ఆ సమయంలో అమ్మ నడుముకు వెళ్లాడుతున్న ఒక తాళం చెవిని గమనించారాయన. అది మా అమ్మ ట్రంకు పెట్టె తాళం చెవి. ‘చాబీ ఇస్తావా’ అని అడిగారట. అప్పుడు అమ్మ నిర్మొహమాటంగా ‘ఇవ్వను’ అని చెప్పిందట. అప్పుడాయన అమ్మ తల మీద చెయ్యి వేసి పుణుకుతూ నవ్వారట. అమ్మ తరచూ ఆ సంగతులను చెబుతూ ఉండేది. జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా 80 ఏళ్ల వయసులో వెంకట సుబ్బమ్మ హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించినప్పటి చిత్రం అలహాబాద్ జ్ఞాపకాలు అమ్మకు పదిమంది సంతానం. నేను తొమ్మిదో వాడిని. నేను, మా ఆవిడ డాక్టర్లం కావడంతో అమ్మ ఆరోగ్యరీత్యా కూడా మా దగ్గర ఉండడమే ఆమెకు సౌకర్యం అనే ఉద్దేశంతో అమ్మను నేనే చూసుకు న్నాను. అలా రోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అమ్మ దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వినడమే నేను ఆమెకిచ్చిన ఆనంద క్షణాలు. ఆ సమయంలో నాకు ఆమె అలహాబాద్ జ్ఞాపకాలను ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఆమె 83 ఏళ్లు జీవించి 2004లో పరమపదించారు. ఆశ్చర్యం ఏమిటంటే... అంతకు ముందు మూడేళ్ల కిందట జాతీయపతాకావిష్కరణ సందర్భంగా ఆమె హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆమె మంచి రచయిత కూడా. చరణదాసు శతకాలు రెండు, కాలేజ్ అమ్మాయిల కోసం నాటకాలు, ప్రభోద గీతాలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె బయోగ్రఫీ రాసుకున్నారు. కానీ అప్పుడు కొంత అప్పుడు కొంత రాస్తూ ఉండడంతో కొన్ని పేజీలు లభించలేదు. ఆ రచనను పరిష్కరించి ప్రచురించడం నాకు సాధ్యం కాలేదు..’’ అని తన తల్లికి చేయాల్సిన సేవ మరికొంత మిగిలిపోయిందన్నట్లు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ రవి కుమార్. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఆయన ఇల్లు... తల్లి రాసిన పుస్తకాల ప్రతులు, ఆమె పుస్తకావిష్కరణల ఫొటోలతో వెంకటసుబ్బమ్మ జాతీయోద్యమ జ్ఞాపకాల దొంతరలా ఉంటుంది. – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామ పరిధిలోని కృష్ణానగర్‌లో వెంకటసుబ్బమ్మ (30) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా.. మైదుకూరు మండలంలోని కోనాయపల్లి గ్రామానికి చెందిన చందా వెంకటస్వామి, వెంకటసుబ్బమ్మలు 2001లో కలమల్లకు వచ్చి కృష్ణానగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. వెంకటసుబ్బమ్మ ఆర్టీపీపీలో మెయింటైన్స్ ఉద్యోగం చేస్తోంది. వెంకటస్వామి కువైట్‌కు వెళ్లి వస్తూ ఉండేవాడు. నెల రోజుల కిందట భర్త కువైట్ నుంచి వచ్చాడు. ఇకపై కువైట్‌కు వెళ్లవద్దని భార్య తరచూ భర్తతో గొడవ పడుతుండేది. బుధవారం కూడా ఈ విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు.భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
‘అనంత’కు మాతృ వియోగం
– ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తల్లి అనంత వెంకట సుబ్బమ్మ (81) గురువారం ఉదయం మతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అనంత వెంకటరామిరెడ్డిని ఫోన్లో పరామర్శించారు. అలాగే మాజీ మంత్రి ధర్మానప్రసాద్‌రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పలువరు కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు.. అనంతకుS ఫోన్ చేసి పరామర్శించారు. -
పెట్టే మనసు... పెంచే నేర్పు
‘‘అమ్మ నాకు ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని నేర్పించింది. అదే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. ఆమె క్షణం విశ్రాంతి తీసుకోకుండా శ్రమించేది. ఎందరు వచ్చినా ఓర్పుగా వండి పెట్టేది. సమాజం నుంచి గౌరవాలు పొందడమే కాదు, అదే సమాజానికి నీకు చేతనైనంత తిరిగి ఇవ్వాలి అనేది నేను ఆమె నుంచే నేర్చుకున్నాను’’ అంటూ తన తల్లి గురించి ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మన్నం గోపీచంద్. ‘‘పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతలను మరింతగా పెంచింది. ఇప్పటి నుంచి నెలకు 50 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తాను’’ అంటున్నారు ఈ డాక్టర్. ‘‘మా అమ్మ వెంకట సుబ్బమ్మ. ఇప్పుడు తనకి ఎనభై ఏళ్లు దాటాయి. మాది ఒంగోలుకు ఐదు కిలోమీటర్ల దూరాన లింగంగుంట. వ్యవసాయ కుటుంబం. మా అమ్మ ఎప్పుడూ పని చేస్తూ, చేయిస్తూ ఉండేది. మమ్మల్ని తనతోపాటు పొలం తీసుకెళ్లి గేదెలకు గడ్డి కోయించేది. నాన్న ఒంగోలులో మెడికల్ షాపు నడిపేటప్పుడు రోజూ మధ్యాహ్నం మా ఇంట్లో పదిహేను మంది భోజనం చేసేవారు. మా గ్రామం నుంచి వైద్యం కోసం వచ్చిన వాళ్లు, ఇతర పనుల మీద పట్టణానికి వచ్చినవాళ్లు ఉండేవాళ్లు. మా అయిదుగురు తోబుట్టువులతోపాటు బంధువుల పిల్లలు కూడా మా ఇంట్లో ఉండి చదువుకునేవాళ్లు. అందరినీ ఆమె ఒకేలా చూసేది. ప్రేమగా భోజనం పెట్టేది. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడేది కాదు. ఎప్పటి పనులు అప్పుడు అయిపోవాలి. లేదంటే ఒప్పుకునేది కాదు. మమ్మల్ని నాన్న ఒక్క దెబ్బ కూడా వేయలేదు కానీ అమ్మ చేతిలో మాత్రం దెబ్బలు పడేవి. అమ్మ కళ్లలో సంతోషం! అమ్మ తన కర్తవ్యాన్ని ఒక యజ్ఞంలా నిర్వర్తించేది. ఎవరి నుంచి ఏమీ ఆశించేది కాదు. పిల్లల మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. నేను ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నప్పుడు ఆమె కళ్లలో పట్టలేనంత సంతోషం కనిపించింది. ఇప్పటికీ తన కోసం ఏమీ కోరుకోదు. ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మా ఊరి దేవాలయాలు, పూజారుల కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటుంది. మా ఊళ్లో పూజారుల కుటుంబాల్లో ఏకాకిగా మిగిలిపోయిన వాళ్లు పన్నెండు మంది వరకు ఉన్నారు. వాళ్లకు ఏటా దుస్తులు, ఏడాదికి సరిపడే ధాన్యం, పప్పులు పంపించాలని కోరింది. అమ్మ కోరిక తీర్చడానికి నేను చేస్తున్నవి ఏవైనా ఉన్నాయంటే ఇలాంటివే. తనకోసం ఆభరణాలు తెచ్చినా వాటి పట్ల ఆసక్తి కనబరచదు. అంతటి నిరాడంబర జీవి. మనుమరాలికీ అమ్మే! మా అమ్మ నాకే కాదు మా అమ్మాయికీ అమ్మే. చేయి పట్టుకుని నడిపించడం, మాటలు నేర్పించడం... పూర్తిగా మా అమ్మ చేతిలోనే పెరిగింది. మమ్మల్ని పెంచేటప్పుడు ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉండేది. మా అమ్మాయిని పెంచేటప్పటికి పనుల నుంచి వెసులుబాటు వచ్చేసింది. తాను నమ్మిన విలువలను మా అమ్మాయికి నేర్పించింది. నికితలో కనిపించే ఫిలసాఫికల్ వే మా అమ్మ వేసిన బాట అనే చెప్పాలి. ఫ్యాషనబుల్ లైఫ్‌స్టయిల్ మీద వ్యామోహం పెంచుకోకుండా బాధ్యతగా వ్యవహరించేటట్లు తీర్చిదిద్దింది. అమ్మ మా కోసం విదేశాలకు రాలేదు కానీ మనుమరాలి కోసం ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఆమె మమ్మల్ని పెంచినట్లే కుటుంబ విలువలు నేర్పిస్తూ మేం పెంచగలమో లేదో నని పాపను మా అమ్మ చేతుల్లోనే పెట్టాం. నికితకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ యానిమేషన్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన రావడానికి స్ఫూర్తి మా అమ్మే. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి