బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గింది. సాగర్ నీటి సామర్థ్యం 17.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.3 టీఎంసీలు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజి ఉన్నా ఆర్టీపీపీకి మాత్రం బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి 40 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది పాలకుల నిర్లక్ష్యం వలన బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది సాగుకు నీరు వస్తుందా రాదా అనేది రైతుల్లో ఆందోళన నెలకొంది.
బ్రహ్మంసాగర్‌లో నీటి కొరత ఉన్నా అధికారులు మాత్రం సాగర్ కుడికాలువ ద్వారా ఆర్టీపీపీకి మాత్రం మరో టీఎంసీ నీటిని విడుదల చేయమని ఉత్తర్వులు ఇవ్వడంతో నెల రోజులుగా ప్రతి రోజు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఒక టీఎంసీ నీటిని విడుదల చేసినట్లవుతుందని అధికారులు చెబుతున్నారు. 1.46 టీఎంసీ నీరు నిల్వ ఉన్నంత వరకు ఆర్టీపీపీకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. బ్రహ్మంసాగర్‌కు ఇంకా నీరు రాకపోవడంతో రైతులు వరి పంటను సాగు చేసుకునేందుకు నీరును ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇంత వరకు పోతిరెడ్డిపాడుకు నీరు చేరకపోవడంతో బ్రహ్మంసాగర్‌కు నీరు చేరాలంటే మరో 20 రోజులైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదైనా సాగర్ నీటి సామర్థ్యంలో కనీసం 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రహ్మంసాగర్‌లో డెడ్ స్టోరేజి
Published Sun, Aug 25 2013 5:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement
Advertisement