భక్తిశ్రద్ధలతో దీక్ష విరమణ
అహోబిలం(ఆళ్లగడ్డ): మండలం (41) రోజులు నియమ నిష్టలతో కఠోరమైన దీక్ష చేపట్టిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దీక్ష స్వాములు శుక్రవారం భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది దీక్ష పరులు ఇరుముడిలతో కాలినడకన నవనరసింహ క్షేత్రం చేరుకున్నారు. తెల్లవారు జామున ఎగువ అహోబిల దేవస్థానంలో చివరి పుణ్యస్నానం ఆచరించి మాలోల నరసింహస్వామి ఆలయం సమీపంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.