విద్యార్థులపై ఖాకీల దౌర్జన్యం | police over action in ysrcp Riley deeksha in visakhapatnam | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ఖాకీల దౌర్జన్యం

Published Sat, Oct 10 2015 1:32 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

police over action in ysrcp Riley deeksha in visakhapatnam

అచ్యుతాపురం: విశాఖపట్టణం జిల్లా అచ్యుతాపురం పట్టణంలో దీక్ష చేస్తున్నయలమంచిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నాగేశ్వరరావుకు మద్దతుగా రిలే దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం దీక్షలకు మద్దతు తెలిపేందుకు కైట్స్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. విద్యార్థులను దీక్షా శిబిరం వద్దకు రానివ్వకుండా ఎస్‌ఐ అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకోవడమేకాక బలప్రయోగంతో వారిని చెదరగొట్టారు. దాంతో విద్యార్థులు పరుగులు తీశారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థులను తరిమేయడం తగదన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement