దీక్షను విజయవంతం చేయాలి
Published Fri, Aug 5 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
డిండి : ఎస్సీ వర్గీకరణ సా«దనలో భాగంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కష్ణమాదిగ ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించే విద్యార్థి సంఘాల దీక్షను విజయవంతం చేయాలని ఎంఎస్‌ఎఫ్ డివిజన్ నాయకుడు దున్న లక్షే్మశ్వర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్లమెంట్‌లో సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బొడ్డు శ్రీకాంత్, అనిల్, వంశీ, రేణు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement