-
సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం తీవ్రం
-
11వ రోజుకు న్యాయవాదుల రిలేదీక్షలు
-
అఖిలపక్షం రాస్తారోకో, ధర్నా
సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధనే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమమే ఊపిరిగా జేఏసీ ముందుకెళ్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదులు చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం 11వ రోజుకు చేరాయి. వీరి దీక్షలకు సెస్‌చైర్మన్, సీనియర్ న్యాయవాది దోర్నాల లక్ష్మారెడ్డి, అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. సిరిసిల్ల జిల్లా సాధిద్దామని దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య మాట్లాడుతూ తాము ఆమరణ దీక్ష చేపట్టినా పట్టింపులేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. జిల్లా సాధనకు ధైర్యంగా పోరాడే వారే తమతోపాటు ఉద్యమించాలని అధికార పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రిలేదీక్షల్లో నాగరాజు, శశాంక్, శ్రీనివాస్, సురేష్‌ప్రసాద్, శ్రీనివాస్‌రావు, మురళి, రమేశ్, వేణు, శాంతిప్రకాశ్‌శుక్లా, సత్యనారాయణ, ఆంజనేయులు, సురేష్, గణేష్, జనార్దన్‌రెడ్డి, శ్రీకర్‌బాబు, మల్లేశం పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆడెపు రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు, అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, స్వర్గం ప్రసాద్, మోర రవి, గడ్డం నాగరాజు, రొడ్డ రాంచంద్రం, కుడిక్యాల రవీందర్ మద్దతు పలికారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి
సిరిసిల్లను జిల్లా చేయాలన్న ప్రజా ఆకాంక్షను నెరవేర్చాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల జేఏసీ నాయకులు కోరారు. ఈమేరకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులైన మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సెస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీ దడిగెల కమలాభాయి, జెడ్పీటీసీ సభ్యురాలు పూర్మాణి మంజుల, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణిలకు వినతిపత్రాలు అందించారు. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు దొంతుల శ్రీహరి, సుధాకర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, నారాయణ, బాలకిషన్, మధుసూదన్, శ్రీనివాస్‌రావు, నరేందర్, సతీశ్, శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, ఆంజనేయులు, రమేశ్‌నాయక్, బిక్కూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట : సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు గంభీరావుపేటలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని, లేకుంటే ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. దళిత సంఘాల నాయకులు దోసల చంద్రం, మంగళి చంద్రమౌళి, ఆవునూరి బాబయ్య, దోసల ఊపేంద్ర, కర్రొల్ల రాజు, ఎడబోయిన రాజు, రాగిశెట్టి నారాయణ, బిక్షపతి, అనిల్ పాల్గొన్నారు.
అఖిలపక్షం ధర్నా
కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ నాయకులు మండలకేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎగదండి స్వామి, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, ఎడబోయిన ప్రభాకర్, ప్రవీన్, భిక్షపతి, మల్లేశం, బీఎస్పీ మండలాధ్యక్షుడు కర్రొల్ల రాజు, బీజేపీ నాయకుడు బాలశంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చేని వెంకటస్వామి పాల్గొన్నారు.