
దీక్షలో భోరుమంటున్న టీడీపీ నాయకుడు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం చేపట్టిన సాధన దీక్షలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. దీక్షకు వచ్చిన కార్యకర్తల్లో కొందరు ‘ఈ దీక్ష దేనికి చేస్తున్నాం. ఏం సాధించడానికి చేస్తున్నాం’ అంటూ భోరుమనగా.. నాయకులు తెల్లమొహాలు వేశారు. ఉదయం టిఫిన్ చేసి దీక్షలో కూర్చోమన్నారని, మధ్యాహం భోజన సమయం ఒంటి గంటకు దీక్ష విరమించేలా ఏర్పాటు చేసినప్పుడు ఖర్చు కూడా ఏమీ కాదు కదా.. ఓ మూడు గంటల పాటు కూర్చుంటే ఏంపోతుందంటూ ఓ నేత వ్యాఖ్యానించడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.
దీక్షలో కూర్చున్న నాయకులు ప్రసంగాలు ప్రారంభించగా.. కొందరు కార్యకర్తలు, నాయకులు తలొంచుకుని దిగాలుగా కూర్చోవడం గమనార్హం. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే చెప్పారని, ఏదో పత్రికల్లో ఫొటోల కోసం షో చేస్తున్నామని మరో నాయకుడు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment