
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ అక్రమ కేసు విచారణకు హాజరు కావాలంటూ నిన్న(బుధవారం) వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్‌లను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జలను 120వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.
కాగా, సజ్జల వెంట పొన్నవోలు, అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఉండగా, పోన్నవోలు సుధాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగం విరుద్ధం అంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలకు అర్థం లేదు: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment