
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు సజ్జల హాజరు కావాలని నోలీసులు ఇచ్చారు.
