మౌనదీక్షలో పాల్గొన్న న్యాయవాదులు
ఖమ్మం లీగల్ : ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ ప్రాంతంలో పెట్టుకున్న ఆప్షన్లను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న విధుల బహిష్కరణలో భాగంగా మంగళవారం మౌనదీక్ష చేపట్టారు. కోర్టు ఆవరణలో నల్లరిబ్బన్లు ధరించి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి హైకోర్టును విభజించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి గంగాధర్, మేకల సుగుణారావు, శ్రీనివాస్‌గుప్తా, రాము, కోటేశ్వరరావు, రాము, చరణ్, నస్రీన్, బిచ్చాల తిరుమలరావు, తిరుమలరావు, కొల్లి సత్యనారాయ ణ, నిరంజన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శేషగిరి, విప్లవ్‌కుమార్, లతీఫ్, బాబ్జి, మధుబాబు, శ్రీనివాస్, థామస్, చంద్రశేఖర్, థామస్, నాగేశ్వరరావు, విద్యాసాగర్, స్వర్ణకుమారి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
తక్షణమే హైకోర్టును విభజించాలి
ఖమ్మం లీగల్ : తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు హైకోర్టును విభజించలేదని, తక్షణమే హైకోర్టును విభజించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జి.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 50 రోజులుగా తెలంగాణ న్యాయవాదులంతా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని సమ్మె చేస్తున్నారని, ఈ విషయంపై పార్లమెంట్‌లో కూడా గళమెత్తాలని కోరుతూ ఎంపీలకు విజ్ఞప్తి లేఖ పంపినట్లు పేర్కొన్నారు.