
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెబుతూ రూ.69.15లక్షలకు మంగళవారం ఐపీ దాఖలు చేశారు. ఈ మేరకు ఖమ్మంకు చెందిన వడ్డే రవికుమార్ 10 మందిని ప్రతివాదులుగా చేరుస్త రూ.33.35లక్షలకు స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశారు. గత పదేళ్లుగా సుజాతనగర్‌లో అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఫెస్టిసైడ్స్ వ్యాపారం నిర్వర్తిస్తున్న తాను వ్యాపారాభివృద్ధికి తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నట్లు తెలిపారు.
అలాగే, ఆయన భార్య వడ్డే ఝాన్సీ సైతం 11మందిని ప్రతివాదులుగా చేరుస్త రూ.35.80లక్షలకు దివాలా పిటీషన్ దాఖలు చేశారు. పదేళ్లుగా ఆమె సుజాతనగర్‌లో సత్య ఎంటర్‌ప్రైజెస్ పేరిట వ్యాపారం నిర్వహిస్తుండగా, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో తనను దివాలాదారుగా ప్రకటించాలని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది బిల్లా శ్రీనివాస్ ద్వారా దివాళ పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment