
ఖమ్మం: నగరానికి చెందిన ఎ.వి.శివకుమారికి చెల్లని చెక్కు కేసులో 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.5000 జరిమానా విధిస్తూ మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి పూజిత బుధవారం తీర్పుచెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన రమాదేవి దగ్గర నిందితురాలు 2015, నవంబర్ 21వ తేదీన రూ.3లక్షలు అప్పుగా తీసుకుని ప్రాంశరీనోటు రాసిచ్చారు.
ఫిర్యాది తన డబ్బులను తిరిగి చెల్లించాలని అడగ్గా నిందితురాలు 2016, ఫిబ్రవరి 1న చెక్కు జారీ చేశారు. ఆ చెక్కును తన బ్యాంకు ఖాతాలో జమ చేయగా, నిరాదరణకు గురి కావడంతో ఫిర్యాది తన న్యాయవాది ద్వారా ఖమ్మం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు.