ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే?
ముంబైలో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు.
ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.
‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్‌లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.
వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం..
ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్‌లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment