Cheque bounce
-
బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష
బెంగళూరు: చెక్కుబౌన్స్ కేసులో మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి కోర్టు నాలుగేళ్ల జైలుశిక్షను విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. హొవప్పగౌడ అనే వ్యక్తి నుంచి కుమారస్వామి రూ.1.35 కోట్లను అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చడానికి కుమారస్వామి 8 చెక్కులను ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో వేయగా అవి చెల్లలేదు. దీంతో బాధితుడు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేసిన కోర్టు కుమారస్వామికి నాలుగేళ్లు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. . -
ఈ రూల్ ఫాలో కాకుంటే..! మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం..!
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి చెక్కు చెల్లింపుల వ్యవస్థలో కొత్త మార్పులు రానున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల ముందస్తు సమాచారం అందించాలని బ్యాంకు ఖాతాదారులను అభ్యర్థించింది. "బీఓబీ కస్టమర్లు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురుంచి ముందస్తు సమాచారం ముందస్తు సమాచారం అందించాలి. తద్వారా సీటిఎస్ క్లియరింగ్ సమయంలో బ్యాంక్ బేస్ బ్రాంచ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ ఫోన్ కాల్ లేకుండానే హై వాల్యూ చాక్‌లను ప్రాసెస్ చేయనున్నట్లు" బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఓబీ ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకొని వచ్చింది. చెక్కు మోసాలను అరికట్టడం కోసం జనవరి 1, 2021 నుంచి కొత్త వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ మార్గదర్శకాలను జారీ చేసింది. "చెక్కు చెల్లింపులలో కస్టమర్ భద్రతను మరింత పెంచడానికి, చెక్కులను ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగే మోసలను తగ్గించడానికి, రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని చెక్కులకు పాజిటివ్ పే యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు" అని ఆర్బీఐ పేర్కొంది. పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి? పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం.. ఖాతాదారుడు ఎవరైనా లబ్ధిదారుడికి చెక్కుజారీ చేసిన తర్వాత ఆ చెక్కు వివరాలను తమ బ్యాంకుతో పంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుతో పంచుకోవలసిన వివరాలలో చెక్కు నెంబరు, చెక్కు తేదీ, పేయీ పేరు, ఖాతా నెంబరు, మొత్తం మొదలైనవి ఉంటాయి. ఖాతాదారులు లబ్ధిదారుడికి చెక్కు ఇచ్చే ముందు ఆ చెక్ ముందు, వెనుక వైపు ఫోటోలు తీసి బ్యాంకుకు పంపాల్సి ఉంటుంది. లబ్ధిదారునికి చెల్లింపు చేసే ముందు, ఖాతాదారుడు ఇచ్చిన చెక్కుపై అన్ని వివరాలను బ్యాంకు క్రాస్ చెక్ చేస్తుంది. ఒకవేళ వివరాలు జత అయితే, అప్పుడు చెక్కు క్లియర్ చేస్తుంది. సీటీఎస్ ద్వారా ఏదైనా అవకతవకలు గుర్తిస్తే బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. (చదవండి: మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ) -
బండ్ల గణేష్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. కోర్టుకు హాజరు ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్‌పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్‌పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
చెక్ బుక్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబందనలు చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబందనలు జాతీయ & ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఈ కొత్త నియమం వల్ల ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు సెలవుదినాలలో కూడా సులభంగా క్లియర్ అవుతాయి. ఈ కొత్త నియమం వల్ల ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చెక్ జారీ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిల్వ ఉంచాలి. అప్పుడే చెక్ సులభంగా క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు సెలవు దినాలు కదా అని సరిపడా నగదు నిల్వ చేయకపోతే మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మీరు జరిమానా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చెక్ బుక్ గల వినియోగదారులు సెలవుదినాల్లో కూడా ఎన్ఏసీహెచ్ పనిచేస్తుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఏసీహెచ్ అనేది ప్రాథమికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ సీపీఐ) నిర్వహించే బల్క్ పేమెంట్ సీస్టమ్. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. -
చెల్లని చెక్కు కేసు.. సరైన శిక్షేపడింది!
ఖమ్మం: నగరానికి చెందిన ఎ.వి.శివకుమారికి చెల్లని చెక్కు కేసులో 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.5000 జరిమానా విధిస్తూ మూడో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి పూజిత బుధవారం తీర్పుచెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన రమాదేవి దగ్గర నిందితురాలు 2015, నవంబర్ 21వ తేదీన రూ.3లక్షలు అప్పుగా తీసుకుని ప్రాంశరీనోటు రాసిచ్చారు. ఫిర్యాది తన డబ్బులను తిరిగి చెల్లించాలని అడగ్గా నిందితురాలు 2016, ఫిబ్రవరి 1న చెక్కు జారీ చేశారు. ఆ చెక్కును తన బ్యాంకు ఖాతాలో జమ చేయగా, నిరాదరణకు గురి కావడంతో ఫిర్యాది తన న్యాయవాది ద్వారా ఖమ్మం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు. -
‘చెల్లని చెక్కుతో లగ్జరీ కారు కొన్నాడు’
వాషింగ్టన్ : రూ కోటి విలువైన పోర్షే లగ్జరీ కారును నకిలీ చెక్‌తో కొనుగోలు చేసిన వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగుచూసింది. తన ఇంట్లోని కంప్యూటర్లో ప్రింట్ చేసిన చెక్‌తో పోర్షే కారును కొనుగోలు చేయడంతో పాటు రోలెక్స్ వాచీలను నకిలీ చెక్‌లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ గతవారం కాసీ విలియం కెల్లీ (42) పట్టుబడ్డాడు. వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం కెల్లీ డెస్టిన్‌లోని పోర్షే డీలర్షిప్ వద్ద జులై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్‌ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకువెళ్లాడు. ఆయన ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో డీలర్ ఒకలూసా కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెల్లని చెక్కు ఇచ్చి పోర్షే కారులో చెక్కేసిన కెల్లీ ఆ కారుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అదే కారులో మిరమర్ బీచ్‌లో ఓ నగల దుకాణానికి వెళ్లి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్ ఇచ్చి మూడు రోలెక్స్ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్ నగదుగా మారే వరకూ వాచ్‌లను జ్యూవెలర్ తన వద్దే ఉంచుకున్నారు. చెక్ చెల్లకపోవడంతో జ్యూవెలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్‌లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్ చేయగా తన ఇంట్లో కంప్యూటర్ నుంచి ఈ చెక్కులను ప్రింట్ చేశానని అంగీకరించాడు. కెల్లీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని వాల్టన్ కౌంటీ జైలుకు తరలించారు. చదవండి : పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు -
చెల్లని చెక్కులు ఇచ్చిన చంద్రబాబు సర్కార్
-
‘చెక్కిస్తే’ పోలా..!
సాక్షి సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖలో అధికారులు డీలర్ల వ్యాపార లావాదేవీలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి వారి ద్వారా రావాల్సిన పన్నుల వసూలు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పలు డివిజన్ల పరిధిలో డీలర్లు చెల్లించిన చెక్కులు వందల సంఖ్యలో బౌన్స్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తద్వారా శాఖకు రావాల్సిన ఆదాయంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సర్కిళ్లలో అధికారులు డీలర్ల వ్యాపారలావాదేవీలపై ఆడిట్ నిర్వహించి వారు కట్టాల్సిన పన్నులకు సంబంధిచిన డిమాండ్ నోటీసులు అందజేస్తారు. దీనిపై స్పందించే డీలర్లు చెల్లించాల్సిన మొత్తానికి సంబందించి చెక్కులు ఇస్తున్నారు. ఇందులో కొన్ని చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డివిజన్లతో పాటు సర్కిళల్లలోనూ పెద్ద సంఖ్యలో చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. గతంలో య్యిట్ రూపంలో వసూలు చేసిన చెక్కులు కూడా ఇప్పటివరకు క్లియర్ కాలేదని సదరు శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా కొందరు డీలర్లకు డబ్బులు చెల్లించాలిని నోటీసులు జారీ చేశామని. మరికొందరి చెక్బౌన్స్లకు సంబంధించిన లెక్కలు తేలాల్సి ఉందని తెలిపారు. అన్ని డివిజన్లలోనూ ఇదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డివిజన్లలోనూ చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.డీలర్లు ఇచ్చిన చెక్కులే ఎక్కువగా బౌన్స్ అవుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో గత ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా పన్ను బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్కిల్ అధికారుల చెక్కులను తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కమిషనర్ పలు డివిజన్లలో పన్ను వసూలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో చెక్కులు తీసుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. టార్గెట్ పూర్తి కోసం అధికారులు పెండింగ్ చెక్‌లకు సంబందించి వసూల్లు చేయకుండా సదరు డీలర్ల నుంచి 2018–19 సంవత్సరానికి జారీ చేసిన డిమాండ్ నోటీసుల అధారంగా పన్నులు బకాయిలు వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు ‘వ్యాట్’ చెక్కులు పెండింగ్‌లో ఉన్నా వాటిని పక్కనపెట్టిన సర్కిల్ అధికారులు జీఎస్టీ అమలు నుంచి టార్గెట్ పూర్తి కోసం కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు. పాతబకాయిలు అంతేనా..? పాత బకాయిల విషయం పట్టించుకోకుండా కొత్త వసూలు చేస్తుండటం పెండింగ్‌లో ఉన్న చెక్కుల విషయంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారుల బదిలీలలో కొత్తగా వచ్చే అధికారులకు పెండింగ్‌లో ఉన్న చెక్కుల విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. గత సెప్టెంబర్ నెలలో వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు అన్ని విభాగాల్లో భారీగా బదిలీలు జరగాయి. డివిజన్లు, సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బంది బదలీ అయ్యారు. దీంతో కొత్తగా వచ్చిన అధికారులు, సిబ్బందికి తమ పరిధిపై పట్టులేకపోవడంతో చెక్ బౌన్స్‌లను పట్టించుకునేవారు కరువయ్యారు. దీనికితోడు రీఆర్గనైజేషన్‌లో భాగంగా పలు సర్కిల్‌లలో పాత వాటిని రద్దు చేసి కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అధికారులకు తమ సర్కిల్లో ఎందరు డీలర్లు ఉన్నారు ? ఎన్ని చెక్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయంపై సమాచారం లేదు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు టార్గెట్ పూర్తి కోసం పెండింగ్ అంశాలను పక్కన పెట్టి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టినట్లు స్వయంగా అధికారులే పేర్కొంటుండటం గమనార్హం. ఎప్పుడైనా పన్ను చెల్లించాల్సిందే డీలర్లకు కమర్షియల్ టాక్స్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అది ఆన్లైన్లో నమోదు అవుతుంది. దీంతో ఎన్నేళ్లయినా డీలర్ పన్ను బాకీ ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆన్లైన్ సీటీడీ జారీ అయితే అందులో మార్పులు చేసేందుకు, పన్ను తగ్గించేందుకు ఎలాంటి అవకాశం ఉండదని ఉన్నత అధికారులు చెబుతున్నారు. ఎప్పుడైనా సదరు డీలరు సీటీడీ ఉత్తర్వుల ప్రకారం పన్ను చెల్లించాల్సిందే. అయితే పలు సర్కిళ్లలో అధికారులు డీలర్లకు కొంత వెసలుబాటు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పెండింగ్ చెక్‌లకు సంబంధించి ఇంతవరకు డీలర్ల ఖాతాలను అటాచ్మెంట్ చేయడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇప్పటికి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేసి ఆస్తులు జప్తు చేయకపోవడం ఇందుకు బలం చేకూరుస్తుంది. -
పసుపు-కుంకుమ కింద చెల్లని చెక్కులు
-
యోగి చెక్ బౌన్స్.. ఫైన్ కట్టిన విద్యార్థి..
లక్నో, ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా క్యాష్ అవార్డు అందుకున్న ఓ విద్యార్థి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఉత్తరప్రదేశ్ 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో అలోక్ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంకు సాధించారు. దీంతో అతనికి సీఎం యోగి లక్ష రూపాయల క్యాష్ అవార్డును చెక్ రూపంలో ఇచ్చారు. సీఎం ఇచ్చిన డబ్బును అందుకున్న అలోక్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు చెక్ బౌన్స్ అయిందని, బదులుగా జరిమానా కట్టాలని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు అలోక్. చెక్‌లో సంతకాలు సరిపోలలేదని అందుకే తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అలోక్ పెనాల్టీ చెల్లించాల్సివచ్చింది. ఈ ఘటపై స్పందించిన డీఐఓఎస్ అలోక్‌కు కొత్త చెక్‌ను ఇచ్చినట్లు వెల్లడించారు. -
‘చెక్కు బౌన్స్ ’ చట్ట సవరణ!
న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్’చట్టానికి సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. చెక్ బౌన్స్ వివాదాల పరిష్కారం చాలా క్లిష్టంగా ఉంటోందని పేర్కొన్నారు. దీంతో డబ్బు రాబట్టడానికి చాలా సమయం పడుతోందని చెప్పారు. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ చట్టానికి సవరణలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎవరి చెక్కు బౌన్స్ అవుతుందో వారు ప్రతివాదన చేసేందుకు ముందే బౌన్స్ అయిన మొత్తానికి సరిపడా నగదును కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆ శాఖ ప్రతిపాదనలు చేసింది. చాలా కోర్టుల్లో పేరుకుపోయిన దాదాపు 18లక్షల చెక్కు బౌన్సు కేసుల పరిష్కారానికి ఈ సవరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి. -
కింగ్ ఫిషర్ అధికారికి జైలు శిక్ష ఖరారు
హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన కింగ్ ఫిషర్ మాజీ ముఖ్య అధికారి ఎ ఎ. రఘు నాథన్ కు18 నెలల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా కూడా దోషిగా తేలినప్పటికీ, ఆయన విదేశాలకు పారిపోవడంతో శిక్ష ఖరారు వాయిదా పడుతోంది. కాగా శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువ గల రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే. -
ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్!
ముంబై : చెక్‌బుక్ జారీ నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీనిప్రకారం.. కోటి పైబడిన చెక్ బౌన్స్ జరిగినా కస్టమర్‌కు, కొత్త చెక్ బుక్ జారీ చేసే నిర్ణయాధికారాన్ని ఇకపై బ్యాంకింగ్ కలిగి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం నాలుగుసార్లు ‘తగిన నిధులు లేక’ చెక్ బౌన్స్ సంభవించి, ఆ మొత్తమూ రూ.కోటి, ఆపైబడి ఉంటే, సంబంధిత కరెంట్ అకౌంట్ హోల్డర్‌కు కొత్త చెక్కు జారీ చేసే అధికారం బ్యాంకింగ్‌కు లేదు. ఇలాంటి సందర్భాల్లో అసలు అకౌంట్ క్లోజ్ చేసే అధికారమూ బ్యాంకింగ్‌కు ఉంటుంది. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశాన్ని బ్యాంక్ బోర్డ్ లేదా కమిటీ నిర్ణయం తీసుకోవాలనీ ఆర్బీఐ తన తాజా నోటిఫికేషన్లో సూచించింది. ఈ మేరకు స్వయంగా నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది. -
వాటర్ వర్క్ ఇన్స్పెక్టర్కు ఏడాది జైలు
ఏలూరు(సెంట్రల్): చెక్‌బౌన్స్ కేసులో ఏలూరు నగరపాలక సంస్థ వాటర్ వర్క్ ఇన్స్పెక్టర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తు గురువారం న్యాయస్థానం తీర్పు చెప్పింది. స్థానిక దక్షిణపువీధికి చెందిన చెరుకుతోట మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి వాటర్ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఉలగల నీలకంఠ గంగాధర్ 2014 మే నెలలో రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చే క్రమంలో 2014 డిసెంబర్లో రూ.3 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఇది చెల్లకపోవడంతో మురళీమోహన్ కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో గంగాధర్‌కు ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి షేక్ అబ్ధుల్ షరీఫ్ తీర్పు చెప్పారు. మరో కేసులో.. చెక్‌బౌన్స్ కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి ఏడాది జైలు విధిస్తు గురువారం న్యాయస్థానం తీర్పు చెప్పింది. స్థానిక గవరవరానికి చెందిన ముదునూరి గంగరాజు అనే వ్యక్తి అప్పు చెల్లించే నిమిత్తం గాంధీనగర్‌కు చెందిన అల్లంపల్లి ఫణికుమార్‌కు 2014 ఫిబ్రవరిలో రూ.4 లక్షల చెక్కు ఇచ్చారు. ఇది బౌన్స్ కావడంతో ఫణికుమార్ కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో గంగరాజుకు ఏడాది జైలు, రూ.5 వేలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి షేక్ అబ్దుల్ షరీఫ్ గురువారం తీరు చెప్పార -
మాల్యా చెక్ బౌన్స్ కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : బ్యాంకుల్లో రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా చెక్‌బౌన్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను ముంబై విలేపార్లే పోలీసులు తిప్పిపంపారు. కాగా మాల్యా నివాసాన్ని ఎస్బీఐ సీజ్ చేసిందని, కింగ్ఫిషర్కు చెందిన యాజమాన్యం, ఉద్యోగులెవరూ లేరని ముంబై పోలీసులు బుధవారం లిఖితపూర్వకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో మాల్యా కొత్త చిరునామాను జూన్ 6లోగా తెలపాలని పోలీసుల్ని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించింది. అలాగే మాల్యాకు మరోసారి వారంట్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకున్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. -
మాల్యాకు మరో షాక్!
హైదరాబాద్: వివిధ బ్యాంకులకు డబ్బు ఎగవేతకు పాల్పడి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఆయన చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకుంన్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా.. విజయ్ మాల్యా చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. మే 5న ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తుదితీర్పును వెలువరించనుంది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. -
చెల్లని చెక్కు... తెచ్చింది చిక్కు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితుడికి నాలుగు నెలల జైలుశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్బీనర్లో నివాసం ఉండే రాజశేఖర్‌రెడ్డి అదే ప్రాంతంలో నివాసం ఉండే రాజన్ నాయర్ పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2012 సంవత్సరంలో రాజన్నాయర్ రూ.4 లక్షలను అప్పుగా రాజశేఖర్‌రెడ్డి నుంచి తీసుకొని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించాలని రాజన్నాయర్ను కోరగా కెనరాబ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్యాంక్‌కు చెందిన రూ. 4 లక్షల చెక్కును రాజశేఖర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్‌ను బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్బీనగర్ బ్యాంచ్‌లో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది చెల్లలేదు. నోటీసు పంపినా రాజన్నాయర్ డబ్బులు చెల్లించకపోవడంతో రాజశేఖర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ సత్యనారాయణరావు పై విధంగా తీర్పు చెప్పారు. -
మార్క్‌ఫెడ్.. మోసం!
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మార్క్‌ఫెడ్ జారీ చేసిన చెక్కు బౌన్స్ కావడంతో రైతన్న నివ్వెరపోయాడు. సాక్షాత్తు ప్రభుత్వ సంస్థే ఇలా మోసం చేస్తే ఎలా అని వాపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన హలావత్ తుకారాం.. తాను పండించిన 71 క్వింటాళ్ల మక్కలను గత డిసెంబర్లో రామాయంపేట మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. ఇందుకు సంబంధించిన డబ్బు కోసం రైతు నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ అధికారులు రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ శాఖకు చెందిన ఖాతా ద్వారా చెల్లించేలా రైతు తుకారం పేరున మార్చి28న 92,355 రూపాయల చెక్కును అందించారు. రైతు చిన్నశంకరంపేట ఎస్బీఐలోని తన ఖాతాలో చెక్కును జమచేశారు. నెల రోజులుగా వేచి చూసినా మార్క్‌ఫెడ్ ఖాతాలో డబ్బులు చేరకపోవడంతో రామాయంపేట ఆంధ్రాబ్యాంక్ అధికారులు చెక్కును వెనక్కి పంపారు. దీంతో శుక్రవారం ఎస్బీఐ శంకరంపేట అధికారులు చెక్కు బౌన్స్ అయిందని ఇచ్చేశారు. దీంతో రైతుకు ఎటు పాలుపోని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా డబ్బులు చెల్లించకపోగా.. తీరా చెల్లని చెక్కు ఇచ్చారని రైతు తుకారాం వాపోయాడు. తనకు వెంటనే డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించాలి రైతుకు జరిగిన అన్యాయంపై కలెక్టర్ స్పందించాలని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పోతరాజ్ రమణ, కామారం మాజీ సర్పంచ్ సుధాకర్‌లు డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా అందించిన చెక్కు బౌన్స్‌కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై నమ్మకం సడలకముందే కలెక్టర్ స్పందించాలని కోరారు. -
ఏసీబీ వలలో వనస్థలిపురం సీఐ
ఆటోనగర్, న్యూస్‌లైన్: చెక్‌బౌన్స్, చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని రిమాండ్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి బాధితుని నుంచి రూ.25వేలు లంచంగా తీసుకుంటుండగా వనస్థలిపురం సీఐ వై.వెంకట్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీలో నివసించే వైఎస్సార్సీపీ పీఅండ్‌టీకాలనీ డివిజన్ అధ్యక్షులు సంగాని నర్సింగ్‌రావు, సరళ దంపతులు నాచారంకు చెందిన వై.శరత్‌బాబుకు సంవత్సరం క్రితం రూ.1.90 లక్షలను అప్పుగా ఇచ్చారు. దానికి ప్రామిసరీ నోటుతో పాటు సిండికేట్ బ్యాంక్ దోమలగూడ బ్రాంచికి చెందిన ఓ చెక్కును సరళ పేరుమీద శరత్‌బాబు ఇచ్చాడు. ఈ చెక్కును సరళ హస్తినాపురం ఎస్బీఐ బ్యాంకులో జమచేయగా చెక్ బౌన్స్ అయింది. శరత్‌బాబుపై చీటింగ్ కేసు పెట్టాలని బ్యాంకు అధికారుల సూచన మేరకు.. 2013 ఏప్రిల్, 24న సరళ చెక్‌బౌన్స్ కేసు వేశారు. దాంతో శరత్‌బాబుపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జూలై 19న కోర్టు ఆదేశించింది. ఈ విషయమై నర్సింగ్‌రావు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి శరత్‌బాబును అరెస్ట్ చేయాలని కోరగా.. అందుకు రూ.45వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరువురి మధ్య బేరసారాలు జరిగి సోమవారం రూ.30 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో విసిగిపోయిన సంగాని నర్సింగ్‌రావు ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డిని ఆశ్రయించి కేసుకు సంబంధించి ఇరువురి మధ్య జరిగిన సంభాషణల రికార్డును అందజేశారు. దీంతో డీఎస్పీ శంకర్‌రెడ్డి నర్సింగ్‌రావుకు రూ.25వేలు ఇచ్చి మధ్యవర్తిగా ఏసీబీ ఉద్యోగిని వెంట పంపారు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లోని సీఐ ఛాంబర్లో నర్సింగ్‌రావు రూ.25వేలు ఇచ్చారు. సీఐ వెంకట్‌రెడ్డి కుడిచేతితో డబ్బులు తీసుకుని తన టేబుల్ డ్రాలో పెట్టి తాళం వేశాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు సీఐని పట్టుకుని ఛాంబర్లోకి తీసుకెళ్లి నగదును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ జూన్ 11న చీటింగ్ కేసులో ద్విచక్ర వాహనాన్ని ఇవ్వడానికి రూ.8వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. రెండు నెలల వ్యవధిలోనే సీఐ వెంకట్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఏసీబీ దాడులలో ఏసీబీ డీసీపీ శంకర్‌రెడ్డితో పాటు సీఐలు వెంకట్‌రెడ్డి, నాయుడు, నిరంజన్, ఎస్.వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అంజిరెడ్డిలు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న రాజకీయ పార్టీల నాయకులు, లారీల యజమానులు స్టేషన్ వద్దకు చేరుకుని స్వీట్లు పంచిపెట్టారు. కాగా సీఐ వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని 1988 అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తన నెం-9440446134కు సమాచారం అందించాలని సూచించారు