యోగి చెక్‌ బౌన్స్‌.. ఫైన్‌ కట్టిన విద్యార్థి.. | Student Pays Fine After Cheque Given By CM Yogi Adityanath Bounced | Sakshi
Sakshi News home page

యోగి చెక్‌ బౌన్స్‌.. ఫైన్‌ కట్టిన విద్యార్థి..

Published Sat, Jun 9 2018 3:41 PM | Last Updated on Sat, Jun 9 2018 3:41 PM

Student Pays Fine After Cheque Given By CM Yogi Adityanath Bounced - Sakshi

అలోక్‌కు చెక్‌ ఇస్తున్న యోగి ఆదిత్యనాథ్‌ (పాత ఫొటో)

లక్నో, ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా క్యాష్‌ అవార్డు అందుకున్న ఓ విద్యార్థి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఉత్తరప్రదేశ్‌ 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో అలోక్‌ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంకు సాధించారు. దీంతో అతనికి సీఎం యోగి లక్ష రూపాయల క్యాష్‌ అవార్డును చెక్‌ రూపంలో ఇచ్చారు. సీఎం ఇచ్చిన డబ్బును అందుకున్న అలోక్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు.

బ్యాంకు అధికారులు చెక్‌ బౌన్స్‌ అయిందని, బదులుగా జరిమానా కట్టాలని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు అలోక్‌. చెక్‌లో సంతకాలు సరిపోలలేదని అందుకే తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అలోక్‌ పెనాల్టీ చెల్లించాల్సివచ్చింది. ఈ ఘటపై స్పందించిన డీఐఓఎస్‌ అలోక్‌కు కొత్త చెక్‌ను ఇచ్చినట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement