రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితుడికి నాలుగు నెలల జైలుశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్‌బీనర్‌లో నివాసం ఉండే రాజశేఖర్‌రెడ్డి అదే ప్రాంతంలో నివాసం ఉండే రాజన్ నాయర్ పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2012 సంవత్సరంలో రాజన్‌నాయర్ రూ.4 లక్షలను అప్పుగా రాజశేఖర్‌రెడ్డి నుంచి తీసుకొని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చాడు.
గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించాలని రాజన్‌నాయర్‌ను కోరగా కెనరాబ్యాంక్ దిల్‌సుఖ్‌నగర్ బ్యాంక్‌కు చెందిన రూ. 4 లక్షల చెక్కును రాజశేఖర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్‌ను బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్‌బీనగర్ బ్యాంచ్‌లో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది చెల్లలేదు. నోటీసు పంపినా రాజన్‌నాయర్ డబ్బులు చెల్లించకపోవడంతో రాజశేఖర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ సత్యనారాయణరావు పై విధంగా తీర్పు చెప్పారు.
చెల్లని చెక్కు... తెచ్చింది చిక్కు
Published Thu, May 22 2014 9:01 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement