
బెంగళూరు: చెక్కుబౌన్స్ కేసులో మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామికి కోర్టు నాలుగేళ్ల జైలుశిక్షను విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. హొవప్పగౌడ అనే వ్యక్తి నుంచి కుమారస్వామి రూ.1.35 కోట్లను అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చడానికి కుమారస్వామి 8 చెక్కులను ఇచ్చారు. చెక్కులు బ్యాంకులో వేయగా అవి చెల్లలేదు. దీంతో బాధితుడు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేసిన కోర్టు కుమారస్వామికి నాలుగేళ్లు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. .
Comments
Please login to add a commentAdd a comment