
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్‌పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది.
గతంలో బండ్ల గణేష్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్‌పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment