
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్‌లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్‌లో ప్రస్తావించారు.

Comments
Please login to add a commentAdd a comment