హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన కింగ్ ఫిషర్ మాజీ ముఖ్య అధికారి ఎ ఎ. రఘు నాథన్ కు18 నెలల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా కూడా దోషిగా తేలినప్పటికీ, ఆయన విదేశాలకు పారిపోవడంతో శిక్ష ఖరారు వాయిదా పడుతోంది.
కాగా శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువ గల రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే.