మాల్యాకు మరో షాక్!
హైదరాబాద్: వివిధ బ్యాంకులకు డబ్బు ఎగవేతకు పాల్పడి ఇప్పటికే విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీఎంఆర్ సంస్థ నమోదు చేసిన చెక్ బౌన్స్ కేసులో ఆయన చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌వేస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ను వాడుకుంన్నందుకు గాను జీఎంఆర్ సంస్థకు గతంలో విజయ్ మాల్యా చెక్కులను సమర్పించారు. అయితే, ఈ చెక్ బౌన్స్ కావడంతో జీఎంఆర్ సంస్థ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బుధవారం ఎర్రమంజిల్ కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా.. విజయ్ మాల్యా చట్టాలను అతిక్రమించినట్లు నిర్థారణ అయింది. మే 5న ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తుదితీర్పును వెలువరించనుంది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.