వాటర్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు ఏడాది జైలు
Published Fri, Jul 22 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఏలూరు(సెంట్రల్): చెక్‌బౌన్స్ కేసులో ఏలూరు నగరపాలక సంస్థ వాటర్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తు గురువారం న్యాయస్థానం తీర్పు చెప్పింది. స్థానిక దక్షిణపువీధికి చెందిన చెరుకుతోట మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి వాటర్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఉలగల నీలకంఠ గంగాధర్ 2014 మే నెలలో రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చే క్రమంలో 2014 డిసెంబర్‌లో రూ.3 లక్షలకు చెక్కు ఇచ్చారు. ఇది చెల్లకపోవడంతో మురళీమోహన్ కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో గంగాధర్‌కు ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి షేక్ అబ్ధుల్ షరీఫ్ తీర్పు చెప్పారు.
మరో కేసులో..
చెక్‌బౌన్స్ కేసులో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి ఏడాది జైలు విధిస్తు గురువారం న్యాయస్థానం తీర్పు చెప్పింది. స్థానిక గవరవరానికి చెందిన ముదునూరి గంగరాజు అనే వ్యక్తి అప్పు చెల్లించే నిమిత్తం గాంధీనగర్‌కు చెందిన అల్లంపల్లి ఫణికుమార్‌కు 2014 ఫిబ్రవరిలో రూ.4 లక్షల చెక్కు ఇచ్చారు. ఇది బౌన్స్ కావడంతో ఫణికుమార్ కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో గంగరాజుకు ఏడాది జైలు, రూ.5 వేలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి షేక్ అబ్దుల్ షరీఫ్ గురువారం తీరు చెప్పార
Advertisement
Advertisement