ప్రత్యేక హోదా కోసం న్యాయవాదుల దీక్ష
ప్రత్యేక హోదా కోసం న్యాయవాదుల దీక్ష
Published Fri, Aug 5 2016 10:32 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM
గుంటూరు లీగల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాదించే విషయంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలలో న్యాయవాదులు భాగస్వాములు కావడం హర్షణీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాశన సభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు చేపట్టిన ఒక రోజు రిలే నిరాహార దీక్షశిభిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదా కల్పిస్తే రాష్ట్రం త్వరిగతిన అభివద్ధి చెందడమే కాక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిచకపోతే నిరసన ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. దీక్షలో బార్‌అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు, రాష్ట్రబార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కార్యవర్గ సంభ్యులు చింతల మల్లిఖార్జునరావు, బండ్లమూడి చంద్రశేఖర్, నెమలికంటి జింబో తదితరులు మాట్లాడారు. సాయంత్రం వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరై దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు.
Advertisement