
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీక్ష ,నిందితున్ని పక్కకు లాగుతున్న నర్సు
కర్ణాటక ,యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో ప్రేమికుడు చేతిలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రి చికిత్స పొందుతున్న ఎంబీఎ విద్యార్థిని దీక్షా ఆస్పత్రిలో కోలుకోంటోంది. దాడి చేసిన నిందితుడు సుశాంత్ పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శక్తినగరకు చెందిన సుశాంత్, దీక్షాల మధ్య ప్రేమ వైఫల్యంగా కారణంగానే ఆమెపై దాడి చేసిన్నట్లు పోలీసులకు చెబుతున్నాడు. డ్యాన్స్ శిక్షణకు వెళ్తుండగా వీరిద్దరి మధ్య ప్రమాయణం సాగింది. అయితే 2016లో ఒక ఘర్షణలో సుశాంత్ తప్పు చేసిన్నట్లు రుజువు కావటంతో జైలుకు వెళ్ళివచ్చాడు. దీంతో దీక్ష అతనికి దూరంగా ఉండగా, అతడేమో వెంటపడి వేధిస్తున్నాడు. ఆమె సుశాంత్‌పై కార్కళ మహిళ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో కక్ష పెంచుకొని దీక్షపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సుశాంత్‌పై మంగళూరు బందరు స్టేషన్‌లో రౌడీషీట్‌ను తెరిచినట్లు మంగళూరు డీసీపీ హనుమంతరాయ తెలిపారు. 2016లో జపాన్ మంగయానె రాజేశ్, సుభాష్ పడీల్ గుంపుల మధ్య గలాటాల్లో కూడా సుశాంత్ ప్రధాన నిందితుడు.
హత్య చేయాలనే దాడి : శుక్రవారం మధ్యాహ్నం సుశాంత్ దీక్షాను హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అప్పుటికే తన ముబైల్ వాట్సాఫ్ స్టేటస్‌లో లవ్ యు దీచు...మిస్ యు బాబా...లవ్ యు లాట్ అని రాసి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం మద్యం తాగి దేరళకట్టె క్షేమ ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం కాలేజీ ముగించుకొని వస్తున్న దీక్షను అడ్డగించి చాకుతో 12 సార్లు పొడిచాడు. కాగా, ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న దీక్ష ప్రాణగండం నుంచి బయటపడినట్లేనని వైద్యులు తెలిపారు. గొంతు, శ్వాసనాళంకి బలమైన గాయం తాగిలాయి. రక్తస్రావం అధికం కావటంతో 20 బాటిళ్ల రక్తంను ఎక్కించారు.
నర్సు సాహసం
ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అక్కడికి వస్తుండగానే అందులో వచ్చిన నర్సు యువతి దీక్ష వద్దకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకోబోయారు. నిందితుడు కత్తితో అక్కడే ఉన్నందున దాడి చేస్తాడేమోనని భయపడ్డారు. కానీ నర్సు ధైర్యంగా వెళ్లి బాధితురాలికి సపర్యలు చేయడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నర్సును నెటిజన్లు అభినందిస్తున్నారు. నర్సు ఆ యువకుడిని పక్కకు నెట్టి యువతిని ఎత్తుకొంటున్న దృశ్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.
రూ. 50 వేలు ఆర్థిక సాయం
దీక్ష కుటుంబాని దక్షిణ కన్నడ ఇన్‌చార్జ్ మంత్రి యుటీ ఖాదర్ రూ. 50 వేలును అర్థిక సాయంగా అందించారు. ఆదివారం దేరళకట్టె కేఎస్ హెగ్డే ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. యువతిపై దాడి జరుగుతుండగా జనం ఆమెను రక్షించకుండా వీడియోలు తీయటం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment